Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఎన్నికల నేపథ్యంలో సిపి రవిశంకర్ కొన్ని ప్రాంతాలు పరిశీలన

విశాలాంధ్ర అనందపురం (విశాఖ జిల్లా): 2024 సాధారణ ఎన్నికల నేపద్యంలో అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., నగరలోని పలు ప్రాంతాలలో చెక్ పోస్టులను, పోలీస్ స్టేషన్లనూ, సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలను ఈ రోజు అకస్మాత్తుగా వెళ్లి, పరిశీలించి తగు ఆదేశాలను జారీ చేశారు.
ఇదివరకే సీపీ ఆదేశాలతో నగర పోలీసు ఉన్నతాధికారులు నగర పరిధిలో సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలను సందర్శిస్తూ , ఏర్పాట్లను పర్యవేక్షించడం విదితమే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ రోజు గురువారం స్వయంగా సీపీ తగరపు వలస, భీమిలీ క్రాస్ రోడ్, చిన్నాపురం, సత్తరవు , అడవి వరం, సరిపల్లి చెక్ పోస్టులను సందర్శించి, చెక్ పోస్టులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్న విధానమును పరిశీలించిన సీపీ , తనిఖీలు నిర్వహిస్తున్న అధికారుల సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధముగా ఆనందపురం పోలీస్ స్టేషన్, ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్లను సందర్శించిన సీపీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికారులు , సిబ్బంది విధులను సమీక్షించారు, స్టేషన్ పరిధిలో గల పోలింగ్ స్టేషన్ల జాబితా పరిశీలించి, సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలయ్యేలా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
వెళ్లంకి వద్ద గల క్లిష్టమైన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ గారు అక్కడి అధికారులు మరియు సిబ్బంది ఎన్నికలకై సంసిద్దమైన తీరు తెలుసుకున్నారు, సీసీటీవీ నిగా ఏర్పాట్ల ప ముందస్తు చర్యలపై ఆరా తీసి, తగు సూచనలు జార ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేటట్లు విధులను నిర్వహించాలని , నగర ప్రజలందరు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img