Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

బీజేపీ, వైసీపీతో ప్రజాస్వామ్యం ఖూనీ

సీపీఐ అభ్యర్థి గాలి చంద్రను గెలిపించండి
కమలాపురం రోడ్‌ షోలో ఓబులేసు
విశాలాంధ్ర- కమలాపురం : ఇండియా కూటమి బలపరుస్తున్న కమలాపురం అసెంబ్లీ నియోజక వర్గ సీపీఐ అభ్యర్థి గాలి చంద్రను గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఓబులేసు ప్రజలను కోరారు. ఆదివారం వైఎస్సార్‌ జిల్లా కమలాపురం స్థానిక రైల్వే గేట్‌ నుంచి గ్రామ చౌక్‌ వద్ద వరకు ఘనంగా రోడ్‌ షో నిర్వహించారు. సీపీఐ శ్రేణులు ఎర్రజెండాలతో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓబులేసు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నాయన్నారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం ధరల పెరుగుదల రోజురోజుకు పెరిగిపోతోందన్నారు. కొత్త భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఐటీని తన చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రతిపక్ష నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపుతోందని మండిపడ్డారు. ఇదంతా దేశ ప్రజలు గమనిస్తున్నారని, మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం నుంచి నియంతృతంలోకి పోతుందని భయాందోళన గురవుతున్నారని తెలిపారు. బీజేపీ, వైసీపీ తమ మేనిఫెస్టోలలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన విషయాన్ని పొందుపరచలేదన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపడతామని, కడప కొప్పర్తి పారిశ్రామిక వాడలో భారీ, మధ్య చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అధికార పార్టీ నాయకులు కమలాపురం నియోజకవర్గ ప్రజల సమస్యలను పక్కనపెట్టి భూ కబ్జాలు, దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అటువంటి వారిని ప్రజలు ఓడిరచి నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న సీపీఐ అభ్యర్థి గాలి చంద్రను గెలిపించాలన్నారు. తొలుత సీపీఐ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు అజీజ్‌ పాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి చంద్రశేఖర్‌, సహాయ కార్యదర్శి జి.నాగేశ్వరావు, ఎన్‌.వెంకట శివ, ఎం.వి.సుబ్బారెడ్డి, ఎల్‌.నాగ సుబ్బారెడ్డి, శ్రీరాములు, కె.సి.బాదుల్లా, వి.గంగా సురేష్‌, సీపీఐ నాయకులు ఎ.వి.శివరామ్‌, వెంకటరామ్‌, బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, సీపీఎం నాయకులు రామ్మోహన్‌ రెడ్డి, దస్తగిరి రెడ్డి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img