Friday, May 3, 2024
Friday, May 3, 2024

పేద, దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు

. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కార్మిక ,ప్రజా వ్యతిరేక విధానాల సమస్యలపై పోరు
. కాకినాడ జిల్లా సిపిఐ ప్రథమ మహాసభ జయప్రదం

కాకినాడ : ఆగస్టు 10 భారత కమ్యూనిస్టు పార్టీ కాకినాడ జిల్లా ప్రధమ మహాసభ బుధవారం ఉదయం కాకినాడలో స్థానిక గాంధీభవన్లో తోకల ప్రసాద్ జి లోవరత్నం కామిరెడ్డి బోడకొండ అధ్యక్షతన జరిగింది ముందుగా స్థానిక భానుగుడి సెంటర్ నుండి భారీ ప్రదర్శన ప్రారంభమై టూ టౌన్, బ్రిడ్జి , మెయిన్ రోడ్, ఎల్ఐసి ఆఫీస్, కల్పనా సెంటర్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వద్ద బహిరంగ సభ జరిగింది ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు హాజరయ్యారు. ఈ బహిరంగ సభలో ఓబులేసు మాట్లాడుతూ పేద, దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా భారత కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని, మున్సిపల్ లో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కార్మిక చట్టాలను నిర్వేర్యం చేస్తూ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆయన అన్నారు .నరేంద్ర మోడీ రాష్ట్రాలను అప్పులు ఊబిలోకి నెట్టే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని ఆదా నీ అంబానీలకు ప్రభుత్వ ఆస్తులను చౌక ధరలకు అమ్ముతున్నారని ప్రభుత్వ రంగాలను నష్టాల పేరుతో నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ప్రజలపై పన్నులు రూపంలో జీఎస్టీ టాక్స్ లో విధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా నీ కాల్ మొక్కుతాన్ బాంచన్ అదేవిధంగా ఆ పథకాల అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన అన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టకు ఈ మహాసభలు వేదికలని ఆయన అన్నారు. రావుల వెంకయ్య మాట్లాడుతూ ఢిల్లీలో రైతన్నల ఉద్యమం వలె ప్రజా ఉద్యమాలు జరగాలని టెక్కో గృహాలు మంజూరు చేయడం లేదని నవరత్నాలు పేరుతో ప్రజలపై అధిక పనులు భారాలు విధిస్తూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర ధరలు ఆస్తి పన్నులు చెత్త పై యూజర్ చార్జీలు ఆర్టీసీ చార్జీలు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని ప్రజల గమనిస్తున్నారని ఎన్నికల్లో సరైన గుణపాఠం ప్రజలు చెబుతారు ఆయన అన్నారు తాటిపాక మధు మాట్లాడుతూ మద్యం నిషేధిస్తామని అందుకే మద్యం మాన్పించడం అధిక ధరలు పెంచుతున్నామని చెబుతూనే బార్లకు లైసెన్సులు ఇస్తూ రకరకాల బ్రాండ్లతో ప్రభుత్వం మద్యం షాపులు నిర్వహిస్తూ ప్రజలతో చెలగాటమాడుతుందని మద్యపాన నిషేధం పూర్తిస్థాయిలో చెయ్యకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని కాకినాడలో మున్సిపల్ కార్మికులకు పెండింగ్ జీతాలు ఇప్పటికే మంజూరు చేయకపోవడం దౌర్భాగ్యం అని కాకినాడ జిల్లా ప్రథమ మహాసభ జయప్రదం అయిందని మహాసభకు సహకరించిన వారందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ లోవరత్నం బొబ్బిలి శ్రీనివాసరావు తుపాకుల లక్ష్మీనారాయణ టీ అన్నవరం బొబ్బిలి సత్యనారాయణ కామిరెడ్డి బోడకొండ శివకోటి రాజు పప్పు ఆదినారాయణ కేశవరపు అప్పలరాజు వివిధ ప్రాంతాలతో ఏడు నియోజకవర్గాల ప్రజా సంఘాల సభ్యులు బాధ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img