Friday, May 17, 2024
Friday, May 17, 2024

నిర్భయంగా ఓటు వేయండి… స్వేచ్ఛాయుత పరిస్థితులు కల్పిస్తాం


జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ విజ్ఞప్తి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : . ప్రతీ ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలు పాటించి పోలీసులతో సహకరించాలని ఎస్పీ పిలుపు స్థానిక అంబేద్కర్ నగర్ లో కాలనీవాసులతో మాట్లాడి ఓటు హక్కుపై చైతన్యం చేశారు. గౌసుల్ వారా వీధిలో ఉన్న మొరార్జీ మున్సిపల్ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని విజిట్ చేసి తగు సూచనలు చేశారు.
జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ నుండీ ప్రారంభమై సుభాష్ రోడ్డు, సప్తగిరి సర్కిల్, సూర్యానగర్ సర్కిల్, సంగమేష్ సర్కిల్, అంబేద్కర్ నగర్, మున్నానగర్, గాంధీబజార్, తాడిపత్రి బస్టాండు, తిలక్ రోడ్డు, శ్రీకంఠం సర్కిల్, ఆర్ ఎఫ్ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా తిరిగి క్లాక్ టవర్ వరకు ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది.
అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, బిఎస్ఎఫ్ ధర్మేంద్రసింగ్, 14 బెటాలియన్ డీఎస్పీ వెంకటరెడ్డి, నగర సి.ఐ లు రెడ్డెప్ప, ధరణీకిశోర్, నారాయణరెడ్డి, సి.ఐ జయంత్ కుమార్ సింగ్ , బిఎస్ఎఫ్ సాయుధ బలగాలు, 14 బెటాలియన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు మరియు నగర పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img