Friday, May 17, 2024
Friday, May 17, 2024

రోబోటిక్ సర్జరీ తో క్యాన్సర్ చికిత్స మేలు

రోబోటిక్ సర్జన్ డాక్టర్ మొహమ్మద్ షాహిద్
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ప్రభుత్వం మెడికల్ కళాశాలలోని సుశ్రుత సెమినార్ హాల్లో రోబోటిక్ సర్జరీ పై అవగాహన కార్యక్రమాన్ని ఎమర్జెన్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ షాహిద్ పాల్గొని రోబోటిక్ సర్జరీ తో శస్త్ర చికిత్సలు ఏ విధంగా అత్యంత సులభంగా చేయవచ్చో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సోదాహరణంగా తెలియజేశారు. వెన్నెముక, యూరాలజీ, గైనకాలజీ, అన్ని రకాల క్యాన్సర్లు కు రోబోటిక్ సర్జరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, మినీ మల్లి ఇన్వేస్ విధానంలో ఓపెన్ సర్జరీలు అవసరమైన అన్ని సమయాలలో రోబోటిక్ సర్జరీ ద్వారా తక్కువ సమయంలో శస్త్ర చికిత్స పూర్తి చేయవచ్చని డాక్టర్ షాహిద్ తెలిపారు. ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు మాట్లాడుతూ అనంత మెడికల్ కళాశాలలోనే డాక్టర్ షాహిద్ 2008 వ సంవత్సరం లో ఎంబిబిఎస్ లో చేరి 2013 లో ఎంబిబిఎస్ పూర్తి చేసి, నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో జనరల్ సర్జరీ, ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ట్రెంటాలజీ హాస్పిటల్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హైదరాబాదులో సర్జికల్ గ్యాస్ట్రియంటాలజీ పూర్తి చేసి, బిరియాట్రిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీలపై ఫెలోషిప్ పొంది చదివిన కళాశాలలోనే ఈరోజు గెస్ట్ లెక్చర్ ఇవ్వడం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మా పూర్వ విద్యార్థి డాక్టర్ షాహిద్ అత్యంత ప్రతిష్టాత్మక సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తిచేసి తన వైద్య సేవలను అనంత ప్రజలకు అందించడానికి ఇక్కడికి రావడం చాలా మందికి స్ఫూర్తిదాయకమని, తన లాగే మరింత మంది మన అనంతపురం వైద్య కళాశాల విద్యార్థులు అత్యున్నతమైనటువంటి వైద్య విద్యలు అభ్యసించి చదివిన కళాశాలకు చదువుకున్న ఊరుకు, పేద ప్రజలకు మేలు చేసేలా వైద్య విద్య అభ్యసించాలన్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రధాన విభాగాధిపతి డాక్టర్ వేముల శ్రీనివాసులు మరియు ఎన్ ఎస్ ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లు డాక్టర్ సారోన్ సోనియా, డాక్టర్ శంషాద్ బేగం, డాక్టర్ నవీన్, సీనియర్ డాక్టర్లు డాక్టర్ రామస్వామి నాయక్, డాక్టర్ భీమసేన చారి, డాక్టర్ రామస్వామి,డాక్టర్ శివ శంకర్ నాయక్, డాక్టర్ సుచిత్ర సౌరి, డాక్టర్ షహజీర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img