Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

పరిశ్రమలలో భద్రతాచర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్

విశాలాంధ్ర,పార్వతీపురం:  పరిశ్రమలలో ప్రమాదాల నివారణ, తీసుకోవలసినచర్యలు, భద్రతాప్రమాణాలు తదితరఅంశాలపై   విద్యుత్  మరియు గనులు శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖమంత్రి గుడివాడ అమర్ నాధ్, కార్మికశాఖమంత్రి గుమ్మనూరు జయరాం  అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాకలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ జల్లాలో గల పరిశ్రమలలో తనిఖీలు నిర్వహించాలని, భద్రత,  పర్యావరణం, కాలుష్యం పై తీసుకోవలసిన చర్యలుపై పరిశ్రమలకు నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. పరిశ్రమల  తనిఖీలకు షెడ్యూలును తయారుచేయాలన్నారు.  ఇండస్ట్రయల్ ప్రమోషన్ అధికారులు ఎ.కిరణ్ కుమార్, కె.వి.రమణమూర్తి నివేదిక సమర్పిస్తూ జిల్లాలో సుమారు 172 పరిశ్రమలు ఉన్నాయని, అత్యంత ప్రమాదస్థాయి పరిశ్రమలు జిల్లాలోలేవన్నారు.ఆరు పరిశ్రమలలో తక్కువ ప్రమాదాలకు ఆస్కారముఉందని, వాటిలో రెండు రెడ్ కేటగిరిలోను, నాలుగు ఆరెంజ్ కేటగిరిలోను ఉండగా,తనిఖీచేయడం జరిగిందని  తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img