Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కొత్త సంవత్సరం వేడుకలు, పండగల సీజన్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన బీఎఫ్‌ 7 వేరియంట్‌ కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు.. ప్రాణాంతకంగా మారాయి. వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ఈ మధ్యకాలలోనే 89,803 కొత్త కేసులు చైనాలోని వేర్వేరు నగరాల్లో నమోదయ్యాయి. దీని ప్రభావం అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియాలపై తీవ్రంగా పడిరది. భారత్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇక్కడ కూడా ఈ మహమ్మారి ఉధృతి మొదలైంది. బీఎఫ్‌ 7 వేరియంట్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి.ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ సమీక్ష చేపట్టింది. కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కోవిడ్‌ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోవిడ్‌ సర్వైలెన్స్‌ వ్యవస్థను పటిష్ట పర్చే దిశగా నిర్ణయాలను తీసుకుంది.
షాపింగ్‌ మాల్స్‌..
ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గైడ్‌లైన్స్‌ ఇచ్చింది. గుంపులు గుంపులుగా ఉన్న ప్రదేశాలతో పాటు ఇండోర్‌, ఔట్‌ డోర్స్‌లల్లో మాస్కులను ధరించాలని సూచించింది. షాపింగ్‌ మాల్స్‌, ఏసీ గదులు, హోటల్స్‌, మల్టీప్లెక్సుల్లో మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. కరోనా వ్యాక్సిన్‌ మూడో డోస్‌ను అందుబాటులోకి తీసుకుని రానున్నామని స్పష్టం చేసింది. ప్రికాషన్‌ డోస్‌ను సిద్ధం చేస్తోంది.
ఎయిర్‌ పోర్టుల్లో..
విమానాశ్రయాల్లో కరోనా వైరస్‌ శాంపిళ్లను తీసుకోవడాన్ని కూడా రెండు రోజుల కిందటే పునఃప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ థర్మల్‌ స్క్రీనింగ్‌, ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల శాంపిళ్లను సేకరిస్తోంది. ప్రస్తుతం విదేశీ ప్రయాణికుల నుంచి మాత్రమే ర్యాండమ్‌గా శాంపిళ్లను సేకరిస్తోన్నామని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్‌ తీవత్ర ఆధారంగా దీన్ని విస్తరించే అవకాశాలు లేకపోలేదు.
కొత్త గైడ్‌ లైన్స్‌..
ఇప్పుడు తాజాగా- మరిన్ని కఠిన ఆంక్షలను జారీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇంకొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. దేశ ప్రజలందరూ కొత్త ఏడాది వేడుకల్లో మునిగి తేలడానికి సన్నాహాలు చేస్తోన్న ఈ పరిస్థితుల్లో కోవిడ్‌ కేసులు ముంచుకొస్తోండటంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఈ సాయంత్రానికి వెలువడిరచనుంది. కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలను విధించడం ఖాయంగా కనిపిస్తోంది. పండగల సీజన్‌పై.. వచ్చేది పండగల సీజన్‌. జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశితో ఈ సీజన్‌ ఆరంభం కానుంది. సంక్రాంతి పండగ క్రయ విక్రయాలతో మార్కెట్లన్నీ కిటకిటలాడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీఎఫ్‌ 7 వేరయంట్‌ మరింత ప్రమాదకరంగా విస్తరించే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలను తీసుకోనుంది. మార్కెట్లు, దేవాలయాల్లో పాటించాల్సిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలపై కొత్త గైడ్‌ లైన్స్‌ ఈ సాయంత్రానికి జారీ చేయనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img