Homeజిల్లాలుఅనంతపురంఅర్హులందరికీ ఇబ్బందులు లేకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి

అర్హులందరికీ ఇబ్బందులు లేకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి

- Advertisement -

: మహేష్ నాయుడు…

విశాలాంధ్ర – నార్పల : మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయంలో కొనసాగుతున్న SI= (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను సొసైటీ చైర్మన్ మహేష్ నాయుడు, మండల కన్వీనర్ కుళ్ళాయప్ప పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను కలిసి ప్రక్రియ నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై అధికారులతో చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా SI= ప్రక్రియను పారదర్శకంగా, సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అలాగే SI= ప్రక్రియలో పేరు నమోదు, మార్పులు, చేర్పులు అవసరమైన అర్హులందరూ జూలై 14 చివరి తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ, నిబంధనల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొనారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు