విశాలాంధ్ర – అగళి: మండల పరిధిలోని బోరుబావులకు అమర్చిన కేబుల్ వైర్లను దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 400 మీటర్ల కేబుల్ వైరు, రెండు స్టార్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ జి. రంగడు యాదవ్ తెలిపారు.పుట్టపర్తి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మడకశిర రూరల్ సీఐ నేతృత్వంలో ఎస్‌ఐ రంగడు యాదవ్ సిబ్బందితో కలిసి కేబుల్ వైర్ల దొంగతనాలపై నిఘా పెట్టారు. అగళి మండలంలోని కదిరేపల్లి, ఇరిగేపల్లి గొల్లహట్టి, అగళి గ్రామాల్లో రాత్రివేళ బోరుబావుల వద్ద కేబుల్ వైర్లు దొంగిలిస్తున్న ఇద్దరిని గుర్తించినట్లు తెలిపారు.కర్ణాటక రాష్ట్రం శిర తాలూకా మూగనహళ్లి గ్రామానికి చెందిన సురేష్, అగళి మండలం కదిరేపల్లి గ్రామానికి చెందిన గురుమూర్తిని సోమవారం ఇరిగేపల్లి గ్రామ శివారులోని మైరాడ ప్లాన్ సంస్థకు చెందిన పాడుబడిన భవనం వద్ద అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.నిందితుల నుంచి సుమారు 400 మీటర్ల కేబుల్ వైరు, రెండు స్టార్టర్లను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని తెలిపారు.
కేబుల్ వైర్ల దొంగలు అరెస్టు-
- Advertisement -
RELATED ARTICLES


