Friday, May 3, 2024
Friday, May 3, 2024

రహదారి భద్రత హెల్మెట్ ప్రాముఖ్యతపై 300 మంది విద్యార్థులకు అవగాహన…

  • గుంతకల్లు డి.ఎస్.పి నరసింగప్ప

విశాలాంధ్ర-గుంతకల్లు : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం వల్ల యాక్సిడెంట్లలో రక్షణ కవచంగా ఉంటుందని డిఎస్పి నరసింగప్ప విద్యార్థులకు వివరించారు శుక్రవారం పట్టణంలోని సరస్వతి జూనియర్ కళాశాలలో జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా డిఎస్పి నరసింగప్ప ఆధ్వర్యంలో 300 విద్యార్థులకు మా చిన్నప్పుడు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ సీఐ రామసుబ్బయ్య, ఎస్సై మురా హరి బాబు, ప్రిన్సిపల్ జోసెఫ్, ఉపాధ్యాయులు సారాభాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి నర్సింగప్ప మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అన్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదన్నారు. త్రిబుల్ డ్రైవింగ్ ప్రమాదకరమని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. అతివేగం ప్రాణాలకు ప్రమాదకరమన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, 300 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img