Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

పింఛన్‌ సంస్కరణలు వద్దు

ఫ్రాన్స్‌లో ప్రజలు వర్సెస్‌ మాక్రాన్‌

పారిస్‌: ఫ్రాన్స్‌లోని మాక్రాన్‌ ప్రభుత్వం తీసుకుకొచ్చిన పింఛన్‌ సంస్కరణలను ఆ దేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఫ్రాన్స్‌ వర్సెస్‌ మాక్రాన్‌ పరిస్థితి నెలకొనివుంది. ఈనెల 7న లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకొచ్చి దేశవ్యాప్త సమ్మెచేశారు. 62 నుంచి 64 ఏళ్లకు పదవీ విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన పింఛన్‌ సంస్కరణను వ్యతిరేకించారు.
ఇది దేశంలో జరిగిన ఆరవ అతిపెద్ద సమ్మె. జనవరి, ఫిబ్రవరిలోనూ భారీగా ఆందోళనలు జరిగాయి. 260 మంది ప్రదర్శనకారులు అరెస్టుకు గురయ్యారు. పారిస్‌లో 7,00,000 మంది నిరసనకారులు పాల్గొన్నట్లు జనరల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ (సీజీటీ) వెల్లడిరచింది. ‘పదవీ విరమణ హక్కు: సామాజిక, రాజకీయ ప్రతిస్పందననేరం’ శీర్షికన ఫ్రాన్స్‌ కమ్యూనిస్టు రివల్యూషనరీ పార్టీ (పీసీఆర్‌ఎఫ్‌) ఓ వ్యాసాన్ని ప్రచురించింది. అందులో మాక్రాన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానంపై ఉద్యమం గురించి తెలిపింది. మాక్రాన్‌ ప్రభుత్వం మరింత బలహీనమవుతుందని హెచ్చరించింది. ఈ సమస్యకు ఫ్రాన్స్‌ కమ్యూనిస్టు రివల్యూషనరీ పార్టీతోనే సమాధానం సాధ్యమని నొక్కిచెప్పింది.సోషలిజంకమ్యూనిజం వర్థిలాలని నినాదమిచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img