Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎత్తు తగ్గించి ఉత్తరాంధ్రని ఎడారి చేయొద్దు

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు
విశాలాంధ్ర-విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌ ప్రజల రాష్ట్రానికి వరప్రసాదిని పోలవరం ప్రాజెక్టు నేడు అందని ద్రాక్ష లాగా మారిపోయిందని సిపిఐ రాష్ర్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు విమర్శించారు.పోలవరం ప్రాజెక్టును ఎత్తుని తగ్గించకుండా పాత డిజైన్‌ లోనే నిర్మణం పూర్తి చేయాలని, నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) రాష్ర్ర సమితి పిలుపు మేరకు సోమవారం ఉదయం విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ ముందు నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పి. కామేశ్వరరావు మీడియాలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఎడారిగా మారిపోవడానికి ప్రధాన కారణం అప్పర్‌ ప్రాజెక్టు నిర్మాణాలన్నారు. జగన్‌ పరిపాలనలో రైతులకు బటన్‌ నొక్కి పథకాలు అని చెప్పి మోసం చేస్తున్నారని అన్నారు. త్వరలోనే ప్రజలు ఓట్లు అనే బటన్‌ నొక్కి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పోలవరం ఎత్తు తగ్గించే కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఖండిస్తున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిపూర్తికి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం వేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించకుండా .45.72 మీటర్ల ఎత్తుతో పూర్తి స్థాయిలో నిర్మించాలి. అందుచేత జాతీయ ప్రాజెక్టు పోలవరం మినీ ప్రాజెక్టుగా మారుతుంది దీని వలన ప్రాజెక్టు నీటి నిల్వ 196.60 టిఎంసి ల నుండి 92 టిఎంసిల కె పరిమితం కానుంది ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 7.20లక్షల ఎకరాల సాగునీరు అందుతుంది 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్సులు బుగత అశోక్‌, అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్‌ రంగారాజు, కోట అప్పన్న, బాయి రమణమ్మ, బుగత పావని, జిల్లా సమితి సభ్యులు ఎస్‌.సునీల్‌, పొందూరు అప్పలరాజు, కె. భీముడు, డేగల అప్పలరాజు, లెంక లక్ష్మీ పార్టీ సభ్యులు కాళ్ళ కృష్ణ, అప్పురుబోతు జగన్నాధం, బూర వాసు, ఎ. రాములు, వడ్డాది కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img