London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

లోకేష్ పాదయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి బాగోతాలు బట్టబయలు…

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్

విశాలాంధ్ర-గుంతకల్లు : లోకేష్ పాదయాత్ర వల్ల వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి భాగవతాలు క్లుప్తంగా ప్రజలకు వివరిస్తున్నందున లోకేష్ పాదయాత్ర పై విశేష ప్రజా ఆదరణ లభించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ అన్నారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ మాట్లాడుతూ..అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర వల్ల అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి దౌర్జన్యం అరాచకాలు ప్రజలకు తెలిసే విధంగా బట్టబయలు అయిందని గతంలో ఎప్పుడూ లేని విధంగా మద్యం మాఫియాలు, ల్యాండ్ మాఫియాలు, ఇసుక మాఫియాలు, మట్టి మాఫియాలుగా అధికార పార్టీ వారు తయారైనారని ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో విఫలమయ్యారని ఈ విషయం ప్రతిపక్షాలే కాదు చెప్పడం ఆదోని వైసిపి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలను కట్టడి చేయడం జగన్కు రావడంలేదని జగన్కు అనుభవం లేదని చెప్పాడని అధికార పార్టీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జగన్ కి అనుభవం లేదని చెప్పాడని అన్నారు. లోకేష్ పాదయాత్ర వల్ల స్థానిక నాయకుల అవినీతి గురించి క్లుప్తంగా చెప్తుంటే ప్రజలలో స్పందన కనిపిస్తుందని అందువల్లనే ఆ పాదయాత్రకు విశేష ఆదరణ లభించిందన్నారు. లోకేష్ పై ప్రేమ కన్నా అధికార పార్టీ పై ప్రజలలో వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుందని తెలిపారు. ఇంత అప్రజాస్వామ్యంగా నియంతృత్వంగా గతంలో ఏ ప్రభుత్వము లేదు అంతేగాక ఎప్పుడూ లేని విధంగా కడప జిల్లాలో ఒక దళిత అధికారి డాక్టర్ అచ్చన్న పై హత్య కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిరసనలు తెలిపితే అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై నిరసన దీక్షలు ధర్నాలకు ఈ ప్రభుత్వం అనుమతించడం లేదన్నారు. ప్రజా సమస్యలపై చలో విజయవాడ కు 11వ తేదీన దళిత సంఘాలు సిపిఐ పిలుపునిస్తే వేల్లనీయకుండా అడ్డుకొని గృహనిర్బంధనలు అరెస్టులు ఏప్రిల్ 10వ తారీఖున అడ్డుకోడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ చర్యల వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతని గోతిని అతనే తవ్వుకున్నట్లుందని జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. కొత్తగా జగనన్న నే మా భవిష్యత్తు అంటూ ప్రచారం చేస్తూ ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అతికిస్తున్నారని అయితే అన్ని వర్గాల ప్రజలేమో జగనన్నే మా అందరిని అంధకారంలోకి నెట్టారని అతికించిన స్టిక్కర్లను ప్రజలే తొలిగిస్తున్నారని స్టిక్కర్లు తీసేసిన వారిపై కూడా దౌర్జన్యం చేస్తూ కేసులు పెడతామని భయాందోళనకు గురి చేస్తున్నారని తెలిపారు. గత ఎన్నికలలో జగన్ కావాలి జగన్ రావాలి అని అన్నారు.అయితే ఇప్పుడు జగన్ వద్దే వద్దు అని ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో ప్రజలు వాపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యం బద్దంగా పనిచేస్తూ దౌర్జన్యాలకు అరాచకాలకు స్వస్తి పలకాలని కోరారు. మే నెలలో నివేశిత స్థలాల విషయంపై పేదలకు భూములను ఆక్రమించి పేదలకు పంపకాలు జరుపుతామన్నారు. ఏప్రిల్ 14 నుండి 30 తారీఖు వరకు మోడీ హటావో దేశ్ కి బచావో ,జగన్ హటావో ఏపీకి బచావో ప్రచార ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు, సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, సిపిఐ నియోజవర్గం సహాయ కార్యదర్శి బి.మహేష్ ,సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎండి గౌస్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img