Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఈఏపీసెట్ పరీక్షను జిల్లాలోనే చేపట్టాలని వీసికి ఏఐఎస్ఎఫ్ వినతి..

విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం : ఈ ఏపీ సెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆ జిల్లాలోని పరీక్ష చేపట్టాలని సోమవారం ఉపకులపతి చాంబర్లో , ఉపకులపతి, ఏపీ సెట్ కన్వీనర్ రంగ జనార్ధన కి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ.కుల్లాయిస్వామి జి.చిరంజీవి మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష కు విద్యార్థులు వేలాది రూపాయలు ఖర్చుపెట్టి సన్నద్ధత అయిన తర్వాత దరఖాస్తు చేసుకున్న జిల్లా కాకుండా పరీక్ష కోసం వివిధ జిల్లాలకు విద్యార్థులను సరైన విధానం కాదన్నారు. వెంటనే ఏ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆ జిల్లాలోని పరీక్షలను చేపట్టాలని కోరారు. ఈనెల 15 వ తేదీ నాటికి 225850 దరఖాస్తులు వచ్చాయని అందుకు తగ్గ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసుకుని విద్యార్థులకు మెరుగైన సేవలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆనంద్,దినేష్, శివ,రమంజి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img