Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

వాలంటరీ వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమంత్రి కృషి

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ పరిధిలో బుధవారం వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నగర పంచాయతీ కార్యాలయ భవనం లో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు మాల గుండ్ల శంకర్ నారాయణ పాల్గొని వాలంటరీ వ్యవస్థ గురించి ప్రసంగించారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు గడపగడపకు చేరుతున్నాయని వాలంటీర్ వ్యవస్థను బలపడటానికి ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు వాలంటీర్ వ్యవస్థ మీద సచివాలయ వ్యవస్థ మీద అనేక నిందారోపణలు చేస్తున్నారని 99% నీతి నిజాయితీగా పనులు జరుగుతున్నాయని లేనిపోని ఆరోపణలతో ఆ వ్యవస్థను నిర్వీర్యము చేయడానికి వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని కావున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మీ మీద ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని నీతి నిజాయితీగా సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు చేర్చడానికి ఒక వ్యవస్థను రూపకల్పన చేసుకోవడంలో ఆ వ్యవస్థ ద్వారా ఎన్ని కార్యక్రమాలు సజావుగా నిర్వహిస్తున్నారని కావున వాలంటీర్లు స్వచ్ఛతతో పనిచేస్తున్నందున వారికి సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్రా అనే పేరుతో వాలంటీర్లు సన్మానము మెడల్ ప్రోత్సాహక బహుమతి లభిస్తున్నాయని జీతము తక్కువైన సంఘంలో గౌరవం ఎక్కువగా ఉన్నందున మంచి గౌరవం పెరగాలని ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు నగర పంచాయతీ పరిధిలో 5 సచివాలయాలకు కాను 5 మందికి సేవ రత్న, 131 మందికి సేవ మిత్ర అవార్డులతో ఘనంగా సన్మానించారు ఇంకా అకుంఠిత దీక్షతో పనిచేసిన అవసరం ఎంతైనా ఉన్నాదని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ ఉమర్ ఫరూక్ వైస్ చైర్మన్ సునీల్, మండలాధ్యక్షుడు గీతా రామ్మోహన్ రెడ్డి, నగర పంచాయతీ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్, కౌన్సిలర్లు సద్దాం, తయుబ్, శ్రీరాములు, బాబు , కొండలరాయుడు, వెంకటరామిరెడ్డి, మారుతి, భాస్కర్ నాయక్, కన్వీనర్ నరసింహులు, రామాంజనేయులు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img