Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ముందస్తుకు వెళితే జగన్‌ ఇంటికే

కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రజలకు చేసిందేమీ లేదు
మోదీ హయాంలో పెరిగిన అప్పులు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విశాలాంధ్ర – విశాఖ : ముఖ్యమంత్రి జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళితే అంతే వేగంగా ఇంటికి వెళతారని, రాష్ట్రానికి మంచి జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్‌ ఓడిపోవడం ఖాయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రచార ఆర్భాటాలు సిగ్గుచేటని విమర్శించారు. విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో 9 ఏళ్లు, కర్నాటకలో 4 ఏళ్లు అధికారంలో ఉన్నా, సాధించిన విజయాలు ఏమీ లేకపోవడంతో కర్నాటక ఎన్నికల ప్రచారంలో జై భజరంగ్‌ బలి అని ఓట్లు వేయమని ప్రధాని మోదీ పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు. 2014లో కేంద్రం అప్పులు రూ.47 లక్షల కోట్లు ఉంటే తొమ్మిది ఏళ్ల వ్యవధిలో రూ.153 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు. డాలర్‌ విలువ 59 రూపాయలు ఉంటే ఇప్పుడు రూ.89కు చేరుకుందని, రూపాయి విలువ కూడా పడిపో యిందని విమర్శించారు. అధికారంలోకి రాగానే వందరోజుల వ్యవధిలో ధరలను తగ్గిస్తానని, ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని, రైతుల ఆదాయం పెంచుతామని, రుణ విముక్తులను చేస్తామని, ఆత్మహత్యలు నివారిస్తామని చెప్పారని, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో దాక్కున్న వారిని పట్టుకుంటా మని, నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. ఏ రంగంలోనూ దేశం ప్రగతి సాధించలేదని రామకృష్ణ విమర్శించారు. బీజేపీ పాలనలో అంబానీ, అదానీ కార్పొరేట్లు మాత్రమే లబ్ధి పొందారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని విస్మరించి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రతిపక్ష నేతలు లేకుండా పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించారని ధ్వజమెత్తారు. జూన్‌ 12న పాట్నాలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమావేశం ఏర్పాటు చేశారని, బీజేపీ పాలనకు చరమగీతం పాడేందుకు ఈ సమావేశంలో చర్చ జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్‌ ఇస్తున్న ప్రకటనలపై మాట్లాడుతూ నాలుగేళ్ల వ్యవధిలో రాష్ట్రం తిరోగమన దిశలో పయనించిందని అన్నారు. రూ.9.30 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగిన ఏడాది రాష్ట్ర ఆదాయం రూ.65 వేల 695 కోట్లని, తెలంగాణ ఆదాయం రూ.51 వేల 041 కోట్లుగా ఉందని అన్నారు. ఇప్పుడు చూస్తే రాష్ట్ర ఆదాయం తెలంగాణ కంటే తక్కువ ఉందని, రాష్ట్ర ఆదాయం లక్షా 58 వేల 282 కోట్ల రూపాయలు కాగా తెలంగాణ ఆదాయం రూ.లక్షా 59 వేల 349 కోట్లని తెలిపారు. 2021`2022లో తెలంగాణలో ఐటీ ఎగుమతులు లక్షా 83 వేల కోట్లు ఉంటే రాష్ట్రం నుంచి రూ.962 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా చూస్తే రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు 0.14 శాతం మాత్రమేనని విమర్శించారు. పట్టభద్రుల్లో నిరుద్యోగులు 35 శాతం మంది ఉన్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 21.15 మీటర్లకు కుదిస్తే పోలవరం స్వరూపమే దెబ్బతింటుందని చెప్పారు. మొదటి వారంలో సాగునీటి ప్రాజెక్టులపై పోరాటానికి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబడిరదని, అమరావతిని ధ్వంసం చేశారని, రియల్‌ ఎస్టేట్‌ కుదేలైందని, కొత్త ప్రాజెక్టులు లేవని, పోలవరం పూర్తికాలేదని తెలిపారు.
వివేక హత్య కేసు విషయంలో సీబీఐ సిగ్గుపడాలని విమర్శించారు. కర్నూలుకు వెళ్లి ఏం చేయలేకపోయారని అన్నారు. కేంద్రంలోని మోదీ, అమిత్‌ షా ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీని ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు, అల్లూరి జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు సీఎన్‌ క్షేత్ర పాల్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img