Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అక్రమ అరెస్టులు ఉద్యమాలను ఆపలేరు

చట్టపరంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు అరెస్టును ఎదుర్కొంటాం.

చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులను కాపాడుకునేందుకు ఉద్యమాలు చేస్తే తప్ప..?

తప్పుడు కేసులు బ నాయిస్తే, ఉద్యమాలను ఉదృతం చేస్తాం

విశాలాంధ్ర -ధర్మవరం : నియోజకవర్ గంలోని ధర్మవరంలో కొన్ని నెలలుగా చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులను పవర్లూమ్స్ యాజమాన్యాల ద్వారా కాపాడుకోవడానికి సిపిఐ ఆధ్వర్యంలో పలు దఫాలుగా పోరాటాలు, నిరసనలు, దీక్షలు నిర్వహించడం జరుగుతోందని, అలాంటి సమయంలో లేనిపోని తప్పుడు కేసులు ప్రజా ప్రతినిధి ప్రోత్సాహంతో కేసులను బనాయించడం సరికాదని, చట్టపరంగానే మధు అరెస్టును ఎదుర్కొంటామని శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో వారు విలేకరులతో మాట్లాడుతూ.. సినిమా పక్కి మాదిరిగా ఓ నాయకున్ని ఫాలోఅప్ చేసి, అరెస్టు చేసి, కోర్టులో రిమాండ్ పంపడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు?. గతంలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి ఎన్నో పోరాటాలు చేసి, అనారోగ్యంతో ఉండడం వల్ల, ఆ ఉద్యమాన్ని మధు చేపట్టడం జరిగిందని. ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందన లేకపోవడంతోనే ఉద్యమాలను ఉధృతం చేయడం జరిగిందన్నారు. చేనేత పరిశ్రమ కుంటు పడకుండా, ప్రభుత్వ జీవో ప్రకారం రక్షించే దిశలో పోరాటం చేస్తే, అక్రమంగా అరెస్టు చేస్తే, భయపడేది లేదని వారు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి కారణంగానే , మధు పై తప్పుడు కేసులను పోలీసులు బనాయించడం జరిగిందని వారు తెలిపారు. మద్యం విక్రయిస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ, ఒక ఉద్యమ కారుని ఉద్యమాన్ని ఆపడం, ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అణచివేత ధోరణి సరికాదని, చేనేత కార్మికులందరూ కూడా ముక్కుముడిగా పోరాటాలు కొనసాగిస్తారని తెలిపారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డిని ప్రశ్నిస్తే, నాకేమీ సంబంధం లేదని బదులు చెప్పడం సరికాదని తెలిపారు. మధు తో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు కానీ, అందులో అధికార పార్టీ సానుభూతిపరులను ఎలా వదిలివేసారని? వారు పోలీసులను ప్రశ్నించారు. ఇదే విషయాన్ని సీఐని అడగగా మీ నాయకులే ఒప్పుకున్నారు అనడం, సరైనది కాదని అధికార పార్టీ వాళ్లకు లోబడి ఇలా కేసులు బనాయించడం ఇకనైనా మానుకోవాలని వారు తెలిపారు. అక్రమ కేసుల ద్వారా ఉద్యమాలను ఏ ప్రభుత్వాలు ఆపలేవని? మాకు ప్రజల అండదండలతో తిరిగి చట్టపరంగా మధును రక్షించుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా తప్పుడు కేసులను ఎత్తివేయాలని, నిజా, నిజాలు తెలుసుకొని చేనేత పరిశ్రమను చేనేత కార్మికులను రక్షించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధికి, సంబంధిత అధికారులకు ఉందని వారు గుర్తు చేశా రు. సంబంధం లేని వ్యక్తి చెప్పడంతో, మధుని ఎలా అరెస్టు చేస్తారని వారు పోలీసులను ప్రశ్నించారు?. ఇది ముమ్మాటికి పోలీసులు యొక్క దుశ్చర్య నని వారు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి వై. రమణ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జేవి. రమణ, రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మహాదేవ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img