Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మేడి పండు ప్రజాస్వామ్యం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎటూ స్వదేశంలో పత్రికల వారి ప్రశ్నలను ఎదుర్కునే సాహసం చేయరు. పత్రికల వారికి అవకాశం ఇస్తే వారు అనేక ‘‘ఇబ్బందికరమైన’’ ప్రశ్నలు అడుగు తారని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ప్రధానమంత్రి అయిన తొమ్మిదేళ్ల పదవీకాలంలో ఒక్కసారి కూడా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించలేదు. ఒక్కసారి మాత్రం విలేకరులు ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం వచ్చినా ఒక్క ప్రశ్నకు కూడా ఆయన బదులివ్వలేదు. కానీ గతవారం (జూన్‌ 22వ తేదీన) అమెరికాలో మొదటిసారి అధికారికంగా అమెరికాలో పర్యటించినప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో పాటు విలేకరుల సమావేశంలో పాల్గొనవలసి వచ్చింది. అందులో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ విలేకరి సబ్రీనా సిద్ధీఖి భారత్‌లో మైనారిటీలు ఎదుర్కుంటున్న సమస్యలపై మోదీని ఓ ప్రశ్న అడిగారు. ఆమె అడిగిందల్లా ‘‘భారత్‌ ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటుంది గదా. కానీ అనేక మానవహక్కుల సంఘాలు మీ ప్రభుత్వం మతపరమైన మైనారిటీల విషయంలో వివక్ష పాటిస్తోందని అంటున్నారు. మీ మీద విమర్శలు గుప్పించేవారి నోళ్లు మూయిస్తున్నారంటున్నారు. ముస్లింల హక్కులను పరిరక్షించడానికి, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడడానికి మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది’’ అని మాత్రమే. ఈ ప్రశ్నతో మోదీ విచలితుడు కావడంలో ఆశ్చర్యంలేదు. ఆయన ముఖకవళికలు అమాంతం మారిపోయాయి. అయినా ఆయన అసలు ప్రశ్నకు సమాధానం చెప్ప కుండా ఈ ప్రశ్న తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. సబ్రీనా సిద్ధీఖీ తల్లిదండ్రుల్లో ఒకరు పాకిస్తాన్‌కు చెందిన వారు. ఈ వివరం మోదీ భక్తులకు, ఆమెను వేధించడానికి బోలెడు సరంజామా అందించింది. బీజేపీ తరఫున సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయడానికి నిబద్ధులై ఉన్నవారు ఆమె మీద దాడి కొనసాగించారు. ఇందులో బీజేపీ సమాచార సాంకేతిక విభాగం అధిపతి అమిత్‌ మాల్వియా అందరికంటే ఎక్కువ ఉత్సాహం ప్రదర్శించారు. ఇంకేముంది? మాల్వియా చూపిన దారిలో మోదీ భక్తులు ఆమె మీద సామాజిక మాధ్యమాలలో విరుచుకు పడ్డారు. సబ్రీనా సిద్ధీఖీ ‘‘పాకిస్తానీ ఇస్లామిస్టు’’ అని ముద్ర వేసేశారు. మరి కొందరైతే ఆమెకు ఉద్యోగం ఇచ్చిన యజమాన్యం ఆమెను ఆ ప్రశ్న అడగడానికి ఎలా అనుమతించింది అని నిలదీసి పత్రికా స్వేచ్ఛ యజమానుల ఇచ్ఛకు పరిమితమైన అంశం అని చెప్పకనే చెప్పారు. ఇది కుట్ర అన్నారు. విచిత్రం ఏమిటంటే మోదీ అమెరికాలో పర్యటించడానికి ముందు ఒక్క వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఎప్పుడైనా పత్రికల వారితో మాట్లాడితే ఒక పత్రికతో మాత్రమే మాట్లాడతారు. బీజేపీకి అనుకూలమైన వెబ్‌సైట్లు ఆమె తల్లిదండ్రుల్లో ఒకరు పాకిస్తాన్‌కు చెందిన వారు కనకే ఆమె ఇస్లామిస్టుల తరఫున మోదీని ప్రశ్నించారు అని భాష్యం చెప్పాయి. ఒక దేశ ప్రధానమంత్రిని ఓ పత్రికా రచయిత అడిగిన ప్రశ్న బీజేపీని ఇరకాటంలోకి నెట్టింది. ఇదీ ప్రజాస్వామ్యం మీద, పత్రికా స్వేచ్ఛమీద, భావ ప్రకటనా స్వేచ్ఛ మీద మోదీకి, ఆయన పార్టీకి ఉన్న విశ్వాసం. నోరు తెరిస్తే భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలపై ఉపన్యాసం లంకించుకునే వారు ఒక్క ప్రశ్నను కూడా భరించలేని స్థితిలో ఉన్నారు. మోదీ భక్తులు అనుసరిస్తున్న ఈ అప్రజాస్వామిక చర్యను దక్షిణాసియా జర్నలిస్టుల సంఘం తీవ్రంగా దుయ్యబట్టడమే కాకుండా సబ్రీనా సిద్ధీఖీకి అండగా నిలిచింది. మహిళా పత్రికా రచయితలు తమ విధి నిర్వర్తించినందుకు వేధింపులకు గురి అవుతున్నారని విమర్శించింది. ‘‘ఇలాంటి ప్రశ్న అడుగుతారని మోదీ బృందానికి తెలిసే ఉంటుంది కదా అని దక్షిణాసియా జర్నలిస్టుల సంఘం అధ్యక్షురాలు మైథిలీ సంపత్‌ కుమార్‌ సజావుగానే వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్ల నుంచి పత్రికల వారిని వాటంగా దాటవేస్తూ వచ్చిన మోదీ గురించి విదేశీ పత్రికా రచయితలు కూడా ప్రశ్నించలేని పాడుకాలం దాపురించింది.
చర్చించాల్సింది సబ్రీనా సిద్ధీఖీ అడిగిన ప్రశ్న సబబా బేసబబా అని కాదు. మోదీ వ్యవహార సరళిని, ఆయన ప్రభుత్వం పెంచి పోషిస్తున్న విద్వేషపూరిత విధానాలనే. అంతో ఇంతో ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించే అవకాశం ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం మాత్రం సబ్రీనా మీద జరుగుతున్న దాడిని ఖండిరచింది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది భారత ప్రధానే అని తప్పించుకుంది. ఎక్కడ జర్నలిస్టులను వేధించినా తాము ఖండిస్తామని అమెరికా జాతీయ భద్రతా వ్యవహారాల గురించి వ్యాఖ్యానించే జాన్‌ కిర్బీ అన్నారు. సబ్రీనా సిద్ధీఖీని వేధిస్తున్న విషయం తమకు తెలుసునని కూడా అన్నారు. ఇలాంటి వైఖరి ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధం, ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని కూడా తెలియజేశారు. అమెరికా అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి కరినె జీన్‌ పియరీ కూడా ఇదే అంశంపై ప్రశ్నలు ఎదుర్కోవలసి వచ్చింది. మానవ హక్కుల గురించి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ భారత ప్రధానమంత్రి మోదీతో ఏం మాట్లాడారు అని కూడా నిలదీశారు. మోదీ అమెరికాలో పర్యటించకముందే అమెరికాలోని అనేక సంస్థలు మోదీని మానవ హక్కుల గురించి బైడెన్‌ నిలదీయాలని కోరాయి. అయితే బైడెన్‌ ఈ అంశాలను నేరుగా ప్రస్తావించిన దాఖలాలు మాత్రం లేవు. ఇద్దరు దేశాధినేతలు ఏం మాట్లాడుకున్నారన్న అంశాల జోలికి తాను వెళ్లబోనని జీన్‌ పియరీ అన్నారు. భారత్‌లో మైనారిటీలపట్ల వివక్ష లేదు అన్న మోదీ సమాధానాన్ని బైడెన్‌ అంగీకరించారా అన్న ప్రశ్నా ఎదురైంది. అమెరికా పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉంది కనకే ఇద్దరు దేశాధినేతలతో పత్రికా సమావేశం నిర్వహించామని బైడెన్‌ అధికార ప్రతినిధులు చెప్పారు.
బైడెన్‌ను మాత్రమేకాకుండా భారత ప్రధానమంత్రిని కూడా ప్రశ్నలడిగే అవకాశం కల్పించడానికే రెండుదేశాల అధినేతలతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశామని వైట్‌ హౌజ్‌ ప్రతినిధి అన్నారు. సబ్రీనా సిద్ధీఖీ మోదీని ప్రశ్నించినందుకు మోదీ భక్తులు రెచ్చిపోయి వారికి బాగా అలవాటు అయిన రీతిలో ఆమెమీద దాడి చేస్తున్నారు. ఆమెను కేవలం ఒక ముస్లింగానే పరిగణిస్తున్నారు. ఇదంతా మోదీ అమలుచేస్తున్న విద్వేష రాజకీయాల పుణ్యమే. ఒక వేళ సిద్ధీకీ అడిగిన ప్రశ్న అసత్యమైతే దానికి మోదీయే ఇబ్బందిపడకుండా మొహం చిట్లించకుండా సమాధానం చెప్పే వారే కదా! స్వదేశంలో మోదీకి ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ ఆయన విదేశీగడ్డ మీద సూటిప్రశ్నలు ఎదుర్కోవలసి వచ్చింది. దానికి ఆయన దగ్గర సమాధానంలేదు కనకే ‘‘ఆశ్చర్యకరమైన’’ప్రశ్న అని సమాధానం చెప్పవలసివచ్చింది. మోదీభక్తులు విదేశంలో ప్రశ్నలడిగే పత్రికారచయితల నైనా వేధించకుండా వదలరు అని రుజువైంది. దాచేసినంత మాత్రాన నిప్పులాంటినిజం ఆగదు. మోదీహయాంలో అమలవుతున్న ప్రజాస్వామ్యం కేవలం మేడి పండు లాంటిదని తేలిపోయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img