Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మణిపూర్‌కంటే ఎన్నికలే మోదీకి ముఖ్యం

మణిపూర్‌లో మంటలను ఎలా చల్లార్చాలో తెలియని ప్రధాని మోదీ,అమిత్‌షాలు ఆ రాష్ట్రంలో పర్యటించడానికి కూడా సిద్ధంగా లేరు. మణిపూర్‌ను పట్టించుకోకుండా ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీల ఎన్నికలకు 2024లో జరగనున్న లోకసభ ఎన్నికలకు సిద్దమవుతున్న మోదీ వైఖరిలో ఏ మాత్రం మార్పులేదని అర్థమవుతుంది. ప్రతిపక్షాల ఐక్యత రోజురోజుకీ బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తుండటంతో మోదీ`షాలకే బీజేపీ నాయకత్వం భీతిల్లుతుందని చెప్పాలి. అందువల్లనే మణిపూర్‌కంటే ఎన్నికల్లో గెలవడమే ముఖ్యం. మణిపూర్‌ ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోన వసరంలేదని భావిస్తూ ఉండవచ్చు. రెండు నెలలుగా రాష్ట్రంలో మంటలు చెలరేగుతున్నా కనీసం ఒక్కసారైనా పర్యటించలేదని మణిపూర్‌ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీపై ఆగ్రహంగా ఉన్నారు. వివిధ జాతుల ప్రజలమధ్య చోటుచేసుకున్న హింసాకాండలో 160 మందికిపైగా ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ స్థితిలో ఉన్న ప్రజలను కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంథీ రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించి బాధితుల నివాస శిబిరాలకు వెళ్లి పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన శాంతి, సామరస్యత సందేశం రాష్ట్ర మంతటా విస్తరించింది. ఇంతవరకు పాలకులు కనీసం తమను పలుకరిం చలేదని ఆగ్రహం చెందుతున్న ప్రజలు రాహుల్‌ పర్యటనను ఆహ్వానిం చారు. సామాన్య ప్రజలేగాక, మేథావులు మోదీని, బీజేపీని వ్యతిరేకిస్తు న్నారు. ఇకపై మణిపూర్‌ ప్రజలు బీజేపీని దూరంగా ఉంచనున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. కాలిపోతున్న రాష్ట్రాన్ని నిర్లక్ష్యంచేసి విదేశీ పర్యటనలో మోదీ విహరించడం ఏమిటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో వేలాది గృహాలను దహనం చేశారు. ఆస్తులు లూటీ చేశారు. లక్షన్నర మందికి పైగా నిరాశ్రయులై నిర్వాసిత శిబిరాలల్లో ఇతర సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. మోదీ రాష్ట్రంలో పర్యటించి బాధితు లను ఓదార్చి సమస్యను పరిష్కరించి సహాయం అందిస్తారని ప్రజలు ఆశించారు. ప్రధాని వైఖరిపై విరుచుకు పడుతున్నారు. ప్రజల మనో భావాలను తెలుసుకునేందుకు మోదీ యత్నించలేదని ప్రజలు ఆసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు అధ్వాన్నస్థితికి చేరాయి. సమస్య మూలాలను తెలుసుకొని ప్రజల బాధలను పట్టించుకోలేదని విద్యావం తులు, మేథావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిదేళ్లకుపైగా బీజేపీ నాయకుడు మోదీ పాలనలో తమకు ఎలాంటి పరిష్కారం లభించలేదని, రాష్ట్ర ప్రజలను పూర్తిగా విస్మరించారని ఇకపై బీజేపీని దూరంగా ఉంచుతామని చెపుతున్నారు. మణిపూర్‌లో ఏం జరుగుతుందని తెలిసినా మోదీ మౌనంగా ఉండటం ఇది మొదటిసారి కాదని, దేశంలోనూ ఏ సమస్యను పరిష్కరించదని అనేకమంది విద్యావంతులు వ్యాఖ్యానిస్తున్నారు.
మోదీ ఏ నిర్ణయం తీసుకోకుండా ఉంటున్నారని, తమ నాయకత్వం తీసుకుంటున్న వైఖరి ఏమిటని కూడా మోదీ గమనించడంలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది విభ్రాంతి గొలిపే విషయం. జాతీయ ప్రాముఖ్యతగల విషయాలను పట్టించుకోకుండా ఉష్ట్ర పక్షిలాగా ఉంటున్నారని కొందరు ఆర్‌ఎస్‌ఎస్‌ దిగువస్థాయి నాయకులు మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులను వ్యతిరేకం చేసుకోకుండా ఉంటున్నారని కూడా సంఫ్‌ు వర్గాలు వ్యాఖ్యానించడం విశేషం. మోదీ బలహీనమైన పాలకుడని కూడా వారు అంటున్నారు. తాజాగా ఏర్పడిన కల్లో పరిస్థితులు ఏర్పడిన నాటి నుంచి మోయితీలు దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. పైగా మోదీ రాష్ట్రంలో పర్యటించడానికి మెయితీలు ఇష్టపడటంలేదన్న సమాచారం ఆశ్చర్యం కలిగిస్తోంది. దాదాపు 300పైగా చర్చిలను ధ్వంసం చేయడంలో రాష్ట్రంలోనూ, దేశంలోని అనేక రాష్ట్రాల క్రైస్తవులు, ఫాదర్‌లు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందని కేరళ చర్చిల ఫాదర్‌లు వ్యాఖ్యానించారు. కుకీలు క్రైస్తవ విశ్వాసకులు. మెయితీలపై ఇప్పుడు తాము పట్టుకోల్పోయామని ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు చెపుతున్నాయి. అందువల్ల తమకు మణిపూర్‌లో అధికారం లేకపోయినా ఇబ్బంది లేదనివారు అంటున్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్‌ సాయంత్రం వరకు రాజీనామా చేస్తానని చెప్పి ఒక్కసారిగా మార్చి రాజీనామా చేయడంలేదని ప్రకటించారు. ఈ నాటకాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వమే నడిపించిందని అంచనా వేశారు.
రాహుల్‌ రాష్ట్రంలో పర్యటించి బాధితులను పరామర్శించి, తాము అండగా నిలుస్తామని ఓదార్చడం ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలకు ఇబ్బందిగా పరిణమించింది. రాహుల్‌ ఎలాంటి రాజకీయాల జోలికి వెళ్లలేదు. ప్రజలంతా శాంతిని కాపాడాలని మాత్రమే ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు కలిసి సంక్షోభాన్ని కాస్త ఉపశమనం చేసేందుకుగాను ముఖ్యమంత్రి రాజీనామా నాటకం ఆడిరచాయని కూడా రాష్ట్రంలో అనేక వర్గాలు వ్యాఖ్యానించాయి. శుక్రవారం ముఖ్యమంత్రి ఉదయం పది గంటల ప్రాంతంలో రాజీనామా పత్రం ఇవ్వడానికి గవర్నరు వద్దకు వెళ్లాలని ప్రయత్నించగా, ఆయనింటికి కొంచెం దూరంలో చాలమంది మహిళలు రహదారిని దిగ్బంధం చేశారు. ఇదంతా నాటకంలో భాగమే. మధ్యాహ్నం 2.30గంటలకు కూడా కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలవడానికి ఇంటినుంచి బైటకురాగా మళ్లీ ప్రజలు వచ్చి అడ్డుకున్నారు. ఇలా సాయంత్రం వరకు నాటకం నడిచింది. మహిళల్లో ఒకరు ఇలా వ్యాఖ్యానించారు. తల్లులంతా ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి వద్దని చెప్పడానికే వాస్తవంగా ఇక్కడికి చేరుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో రెండు నెలలుగా జరుగుతున్న విధ్వంసం, దహనకాండకు మహిళలంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులు సరిగా ఆహారం, దుస్తులను సహాయం చేయడంలేదని రాహుల్‌గాంధీకి చెప్పారు.తాము ఏదో విధంగా జీవిస్తున్నామని బాధను వ్యక్తం చేశారు. ఈ విషయాలను రాహుల్‌గాంధీ రాష్ట్ర గవర్నరును కలుసుకుని వివరించి, చర్యలు తీసుకోవాలని కోరారు. హింస పరిష్కారం కాదని, శాంతిని పాటించాలని ప్రజలకు రాహుల్‌ విజ్ఞప్తి చేశారు. శిబిరాలు సందర్శించాక, భయంకరమైన విషాదం చోటుచేసుకున్నదని రాహుల్‌ వ్యాఖ్యానించారు. గవర్నరును కలిసిన తర్వాత రాహుల్‌ విలేకరులతో మాట్లాడుతూ, హింసవల్ల ఎవరికీ ప్రయెజనం కలగదు, శాంతి మాత్రమే భవిష్యత్‌ను నిర్దేశిస్తుందని అని ఆయన అన్నారు. తాను కలుసుకున్న సోదరీ, సోదరీమణులు, పిల్లల సహాయంకోసం ఎదురు చూస్తున్నామని చెప్పారని అన్నారు. శిబిరాల్లో మౌలికసదుపాయాలను మెరుచుపచాలని ఆయన కోరారు. ఆహారం, మందులు సరఫరా చేయాలన్నారు. శాంతి అన్నిటికంటే ముఖ్యమైనదని రాష్ట్ర ప్రజలంతా కలిసి సాధించాలని కోరారు. తక్షణం మోదీ మణిపూర్‌లో పర్యటించి సమస్యను పరిష్కరించకపోతే ఆ రాష్ట్రం రావణకాష్టంలా తయారుకావచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img