Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

భారమైన కార్మికుల జీవనం

డాక్టర్‌ జ్ఞాన్‌ పాఠక్‌

కార్మికుల పని పరిస్థితులు ఏ మాత్రం మెరుగుపడలేదు. ఫలితంగా కార్మికుల జీనవం భారమైంది. జూలై 1, 2023న సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి(సీఎమ్‌ఐఈ) గణాంకాల ఆధారంగా, దేశంలో నిరుద్యోగిత 8.4 శాతానికి పెరిగింది, 30 రోజుల సగటు ఆధారంగా తీసుకున్న లెక్కల ప్రకారం నిరుద్యోగంతోపాటు ప్రజల జీవనోపాధి దిగజారింది. మార్కెట్లో ఉద్యోగాల లభ్యత అతి తక్కుగా ఉంది. ఉద్యోగుల్లో ఎక్కువ భాగం నూతన ఉద్యోగాల కోసం వెతకడం కూడా మానేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ‘ఉపాధి మేళాలు’ నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి లేఖలు పంపడం వంటి వ్యూహ రచనలు చేస్తున్నారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2013-14లో, భారతదేశంలో నిరుద్యోగ రేటు కేవలం 4.9 శాతం కాగా, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ డేటా ప్రకారం 2017-18లో 6.1 శాతం ఉంది. తాజా గణాంకాల ప్రకారం జూలై 1, 2023 నాటికి నిరుద్యోగిత 8.4 శాతానికి చేరింది.
201314 సంవత్సరంలో దేశంలో ఉపాధి, నిరుద్యోగంపై కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ నాల్గవ వార్షిక నివేదిక ప్రకారం, 201213 ఆర్థిక సంవత్సరంలో కార్మికులు పాల్గొనే రేటు (ఎల్‌పీఆర్‌) 52.5 శాతంగా అంచనా వేసింది. ఈ కాలంలో శ్రామిక జనాభా నిష్పత్తి 49.9 శాతం ఉంది. నవంబర్‌ 8, 2016న ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు ప్రకటించిన సంవత్సరం 2016-17 నుండి దేశంలో ఎల్‌పీఆర్‌ వేగంగా క్షీణిస్తోంది. ఆ సంవత్సరంలో పెద్ద సంఖ్యలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు మూసివేత కారణంగా ఎల్‌పీఆర్‌ 46.2 శాతానికి దిగ జారింది. దేశంలో నగదు ప్రవాహంపై ఎక్కువగా ఆధారపడిన వివిధ పరిశ్రమలు మూతపడ్డాయి. దీనితోపాటు జులై 1, 2017న జిఎస్‌టిని అమలుతో ఉపాధి, జీవనరంగాలపై ప్రతికూల ప్రభావంపడిరది.
సీఎమ్‌ఐఈ తాజా గణాంకాల ప్రకారం, శ్రామిక శక్తి 2021-22లో 40.1 శాతం క్షీణించింది. 2022-23లో ఇది మరింత తగ్గి 39.5 శాతానికి చేరింది. ఇది ప్రపంచంలోనే అత్యల్ప స్థాయి. అంతర్జాతీయంగా శ్రామిక శక్తి సగటు 60శాతం కాగా, ఇండోనేషియాలో ఎల్‌పిఆర్‌ 67శాతం, దక్షిణ కొరియా, బ్రెజిల్‌ దేశాల్లో 63-64 శాతం ఉందని ఈ విశ్లేషణ పేర్కొంది. 2019`20 సంవత్సరంలో కరోనా మహమ్మారి కాలంలో 442 మిలియన్లు ఉన్న శ్రామిక శక్తి, 2020-21లో 424 మిలియన్లకు తగ్గడంతో దేశీయ శ్రామికశక్తిలో గణనీయమైన క్షీణత నమోదైంది. 2022-23లో శ్రామిక రంగం 439 మిలియన్లకు చేరింది. అయితే ఇది మహమ్మారికి ముందు ఉన్న స్థాయి కంటే తక్కువని చెప్పవచ్చు 2016-17లో 15 శాతం ఉన్న మహిళా కార్మికుల వాటా 2022-23లో 8.8 శాతానికి పడిపోయింది. సీఎమ్‌ఐఈ విశ్లేషణ ప్రకారం, మన దేశంలో పనిచేసే వయస్సులో ఉన్న 90 శాతం మంది మహిళలు శ్రామిక రంగానికి దూరంగా ఉన్నారని పేర్కొంది.
2014 నుండి గత తొమ్మిదేళ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించిందని కేంద్ర ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ తాజాగా ప్రకటించారు. వాస్తవానికి, గత 9 సంవత్సరాలలో కేవలం 1.25 కోట్ల ఉద్యోగాలను మాత్రమే సృష్టించింది. ఇది ప్రతి సంవత్సరం అవసరమయ్యే 2 కోట్ల ఉద్యోగాలకు చాలా తక్కువనే చెప్పవచ్చు. దేశంలోని జాబ్‌ మార్కెట్‌లో ప్రతి సంవత్సరం ఎక్కువమంది యువత ప్రవేశిస్తున్నారు.
2014 లోకసభ ఎన్నికల ప్రచార సమయంలో ‘‘అందరికీ గౌరవప్రదమైన పని’’ ఇస్తామని వాగ్దానం చేసిన ప్రధాని మోదీ దేశ ప్రధాని అయిన తర్వాత మాట తప్పారు. అసంఘటిత రంగంగో తక్కువ-నాణ్యత గల ఉద్యోగాలు 90 శాతం కంటేె ఎక్కువగా ఉన్నాయి. అయితే పని చేసే వయస్సులో ఉన్న జనాభాలో ఎక్కువ మందికి పని లేదు. ప్రస్తుతం 60.5 శాతం మంది కార్మికులకు సరైన పనిలేదు. పనిలేని పురుషుల శ్రామిక జనాభా దాదాపు 31శాతం కాగా, పనిలేని మహిళా శ్రామిక జనాభా 90 శాతం. అసంఘటితర రంగంలో ఉన్న కార్మికులకు సామాజిక భద్రత కవరేజీ లేదు.
2015లో కార్మిక విధానాలపై దేశంలోని అత్యున్నత త్రైపాక్షిక సంస్థ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ జాతీయ ఉపాధి విధానం(ఎన్‌ఇపి) రూపొం దించడానికి సిఫారసు చేసింది. మోదీ ప్రభుత్వం దీనిని అంగీకరించింది. అయితే దీని నుండి వెనక్కి తగ్గింది. భారత పార్లమెంట్‌లో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ అందించిన సమాచారం ప్రకారం, ఉపాధి కల్పనపై కేంద్రం జాతీయ ఉపాధిపథకం(ఎన్‌ఈపీ) ఎటువంటి ప్రణాళిక లేదని పేర్కొంది.
అభివృద్ధి విధానాలకు అనుగుణంగా తగిన ప్రణాళిలకను మానవ కేంద్రంగా రూపొందించాలని అంతర్జాతీయ కార్మిక సమాఖ్య, ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను కోరుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లోఅశాంతిని నివారించడానికి, ఇబ్బందులను అధిగమించ డానికి ఇటువంటి విధానాలను అవలంబించడం అవసరమని ఐఎల్‌ఓ, యుఎన్‌ హెచ్చరించాయి.. అయితే, భారతదేశంలోని 20 అగ్రశ్రేణి కంపెనీల లాభాల్లో 70 శాతం లాభాలు కైవసం చేసుకుంటున్నాయి. పెట్టుబడీదారీ విధానాలకు అనుగుణంగా లాభాపేక్షతో కూడిన అభివృద్ధి విధానాలకు అనుకూలంగా ఉన్న ప్రతిపాదనలను, సలహాలను ప్రధాని మోదీ విస్మరిస్తున్నారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ట్యాగ్‌తో అంచనా వేయ బడిరది, ప్రధాని మోదీ హయాంలో దేశంలో నిరుద్యోగిత మరింతగా పెరిగింది. 2019లో భారతదేశంలో 134 మిలియన్ల మంది ప్రజలు అంతర్జాతీయ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు, అంటే రోజుకు కేవలం 2.15 డాల్లర్లతో జీవనం సాగిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది, ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 మిలియన్ల మంది పేదరికంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పేదలకు భారతదేశం నిలయంగాఉంది. 2030నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదంఉందని ప్రపంచబ్యాంకుకు సంబంధించిన ఎస్‌డీజీ అట్లాస్‌ నివేదిక పేర్కొంది. 2021లో సుమారు 973 మిలియన్లమంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేక పోతున్నారు. ఇది ప్రస్తుత జనాభాలో 68.5 శాతానికి పైగా ఉంది. నిరుద్యోగం మరింతగా పెరగడం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం కారణంగా అప్పటి నుండి పరిస్థితి మరింతగా దిగజారింది. ఈ నేపథ్యంలో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడం, జీవనోపాధి వనరులు ఎండిపోవడం భవిష్యత్తు మరింత భయానకంగా ఉంది. సంపదను కొందరి చేతుల్లోకి పోగుచేసుకోవడం(క్రోని కేటిటలిజం) కోసం నిరుద్యోగ వృద్ధి వ్యూహాన్ని అనుసరించడం కంటే ప్రజలను మానవ కేంద్రంగా మార్చడం ద్వారా ప్రజలను రక్షించడానికి మోదీ ప్రభుత్వం తన ఆర్థిక విధానాలను మార్చవలసి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img