Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రజాస్పందనపైనే ప్రజాస్వామ్య భవిష్యత్తు

డాక్టర్‌ సీ.ఎన్‌. క్షేత్రపాల్‌ రెడ్డి,
9059837847

ఈ క్రమంలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమా అనే చర్చ తీవ్రమైంది. వాస్తవానికి ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడటం ఇది తొలిసారి కాదు. ఇందిరా గాంధీ పాలన నేటి మోదీ ప్రభుత్వానికి భిన్నమైనదైనా ఆమె విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టయ్యింది. దాదాపు రెండేళ్ల పాటు దేశంలో నిరంకుశత్వం రాజ్యమేలింది. ఈ నిరంకుశత్వం కారణంగానే ఇందిర అధికారానికి దూరమైంది. కాబట్టి ప్రజాస్వామ్య భవిష్యత్తు దేశ ప్రజల ఆలోచనా సరళిపై ఆధారపడి ఉంటుంది. 2024లో సార్వత్రిక ఎన్నికలున్నాయి. నేడు అధికారంలో ఉన్న బీజేపీని ఓడిరచడం అసాధ్యమేమీ కాదు. తాజాగా కర్నాటక ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఎవర్జెన్సీ రూపంలో ప్రజాస్వామ్యానికి పాతరేసిన ఇందిరను గద్దె దించిన ప్రజలు మోదీని దించలేని అశక్తులు కారు. ఇప్పటికే దేశంలోని ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకమవుతున్నట్టు సంకేతాలిచ్చిన నేపథ్యంలో ప్రజా ప్రతిస్పందనపైనే ప్రజాస్వామ్య భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ల మధ్య చర్చల జాబితాలో లేని కీలకాంశం ప్రజాస్వామ్యం. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిరదని అంతర్జాతీయ మీడియా సంస్థలు అనేక కథనాలు ప్రచురించినా ప్రధాని వాటికి సమాధానం ఇవ్వకుండానే తిరిగి వచ్చారు. రాహుల్‌ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై ఇంటా బయటా తీవ్రంగా విరుచుకుపడిన ప్రధాని మోదీ అక్కడి మీడియా చేసింది కేవలం ఆరోపణలే అయితే మరింత తీవ్రంగానే విరుచుకుపడేవారు. కానీ అక్కడి మీడియా చాలా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగానే విమర్శనాత్మక కథనాలు అందించింది. ప్రజాస్వామ్యంలో కీలకంగా ఉండే ప్రశ్నించే తత్వాన్ని మోదీ ప్రభుత్వం ఎలా అణచి వేస్తోందో ఉదాహరణలతో సహా వెలుగులోకి తెచ్చింది. ప్రశ్నించే గొంతుకలకు చుక్కానిగా నిలుస్తున్న మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై దేశద్రోహం వంటి క్రూర చట్టాలను ప్రయోగించి జైళ్లలో కుక్కిన ఉదంతాలను ప్రచురించి ఇదేనా ప్రజాస్వామ్య దీపిక అంటూ ఘాటుగానే నిలదీసింది. అసలు మీడియా సమావేశాలకు నిత్యం ముఖం చాటేసే ఆయన అనుకోకుండా వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో పాల్గొనాల్సి రావడం, అక్కడ ఎదురైన ఒకే ఒక ప్రశ్న ఇరుకున పెట్టింది. సమాధానంగా భారత్‌లో మత విద్వేషమనేది లేనేలేదని చెప్పారు. మోదీ భారత్‌ చేరక ముందే ఆ ప్రశ్న వేసిన మీడియా ప్రతినిధి సబ్రినా సిద్దిఖిపై మోదీ అనుయాయులు, వాట్సప్‌ యూనివర్సిటీ భక్తులు విద్వేషం వెళ్లగక్కడం మన కళ్లముందే ఉంది. వైట్‌హౌస్‌ కూడా మోదీని ప్రశ్నించిన మీడియా ప్రతినిధిపై భారత్‌లో సాగిన విద్వేషంపై ఘాటుగా స్పందించి ఆమెకు మద్దతు ప్రకటించింది. దీంతో వైట్‌హౌస్‌ సాక్షిగా భారత్‌లో విద్వేషం లేదని మోదీ చెప్పడం బుకాయింపని తేలిపోయింది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాత్రమే ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందనుకుంటే పొరపాటే. ప్రజాస్వామ్య వ్యతిరేకత రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) డీఎన్‌ఏలోనే ఉంది. నియంతగా పేరుపొందిన ముసోలినీ అవలంబించిన ఫాసిజం సూత్రాలకు అనుగుణంగా తయారైన సిద్ధాంతమే ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం. దీన్ని ముసోలినీ ఫాసిజానికి భారతీయ వెర్షన్‌ అన్నా తప్పుకాదు. భారతదేశంలో ప్రజాస్వామ్య పతనాన్ని అర్థం చేసుకోవాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ మూలాలను అర్థం చేసుకోవాలి. ఆర్‌ఎస్‌ఎస్‌ పుట్టుక మొదలు నేటి వరకూ భారత దేశాన్ని జాతి, మతం అనే అంశాల ద్వారానే నిర్వచిస్తోంది. అందుకే ప్రజలంతా స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్నా స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా ఆ సంస్థ పని చేసింది. వలస పాలనకు మద్దతు పలికింది. స్వాతంత్య్ర పోరాటం ఉవ్వెత్తున ఎగుస్తుండడాన్ని చూసిన ఆ సంస్థ సర్‌ సంచాలక్‌ గోల్వాల్కర్‌ వలస పాలన అంతరిస్తే భారతదేశం హిందూ దేశంగా ఉండాలని కోరుకున్నారు. ఈ ఆకాంక్షను ప్రతిఫలించేలా 1939లోనే ‘వి ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్డ్‌’ శీర్షికతో తన ఆలోచనలకు ఒక పుస్తక రూపం ఇచ్చారు. భారతదేశంలో విదేశీ జాతులుండా లంటే హిందూ జాతిలో విలీనం కావాలి, లేదా తమ ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోవాలని పేర్కొన్నారు. ఎటువంటి హక్కులు, అధికారాలు లేకుండా జీవించాలని వాదించడానికి ఆయనలోని ప్రజాస్వామ్య వ్యతిరేకతే కారణం. ఆయన యూదులపై నాజీలు చేసిన దమనకాండను ప్రశంసించారు. ఇది హిందుత్వ వాదులకు ఆదర్శం కావాలని ప్రోత్సహించారు.
అయితే ఈ ఆలోచనలేవీ స్వాతంత్ర పోరాటంలో ఉన్న నాటి సమాజాన్ని ప్రభావితం చేయలేకపోయాయి. స్వాతంత్య్రానంతరమూ ఈ ఆలోచనలకు మద్దతు దక్కలేదు. మతం, జాతి, కులం, లింగం ఆధారంగా ప్రజలపై ఎటువంటి వివక్ష ఉండకూడదని భారత రాజ్యాంగం స్పష్టం చేసింది. ఈ కారణం చేతనే భారత రాజ్యాంగాన్ని అంగీకరించబోమని, మనువాదమే తమ చివరి రాజ్యాంగమని చాలా స్పష్టంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది. ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజకీయ ముఖంగా ఏర్పాటైన భారతీయ జనసంఫ్‌ుకు ప్రజాదరణ, ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కకపోవడంతో 1980 నాటికి భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. మత రాజకీయాలనే నమ్ముకుంది. 1998లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచింది. దేశ రాజ్య స్వభావాన్ని మార్చడానికి తీవ్రమైన చర్యలేవీ తీసుకోలేకపోయినా మతతత్వ భావజాలం మారలేదు కాబట్టే గోద్రా అల్లర్లకు అండగా ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేంద్ర మోదీని 2014లో ప్రధాని అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు తెచ్చింది.
మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫాసిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసమే తమ అధికారాన్ని ఉపయోగించడం మన కళ్లముందుంది. అధికారాన్ని ఏకీకృతం చేయడం ద్వారానే ప్రజస్వామ్యం మనుగడను పూర్తిగా రూపుమాపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్‌ సహా వివిధ దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేస్తూ వచ్చారు.2019ల్లోనూ మరోసారి గెలవడంతో ప్రజస్వామ్యం పీక నులిమే పనిని వేగవంతం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. నూతన పార్లమెంటు భవనం ప్రారంభం పేరుతో రాష్ట్రపతిని మనందరి కళ్ల ముందే అవమానించి ప్రజాస్వామ్య సౌధాన్ని బుల్డోజ్‌ చేశారు. ఎన్నికల పర్యవేక్షణ అధికారం ఉన్న ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను పూర్తిగా దెబ్బతీసి తమ అదుపాజ్ఞల్లో ఉండే సంస్థగా, న్యాయ వ్యవస్థను తమకు అనుకూల తీర్పులిచ్చే వ్యవస్థగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. న్యాయమూర్తులను ఇందుకు పావులుగా వాడుకున్నారు. తమకు అనుకూల తీర్పు ఇచ్చిన ఒక ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేయగానే రాజ్యసభలో సీటు కల్పించడమే ఇందుకు నిదర్శనమనేది విమర్శకుల వాదన.
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లువేసి తన నియంత్రణను పెంచుకుంది. ప్రభుత్వానికి ఇరుసులుగా పనిచేస్తున్న అంబానీ చేతుల్లోకి 27 ఛానళ్లు, అదానీ చేతుల్లోకి 11 ఛానళ్లు చేరాయి. ప్రభుత్వ పెద్దల సహకారంతో ఎన్‌డీటీవీని అదానీ చేతుల్లోకి తీసుకోవడమే ఇందుకు తాజా ఉదాహరణ. అంతర్జాతీయ మీడియాపైనా ప్రభుత్వమే అక్కసును వెళ్లగక్కుతోంది. గుజరాత్‌ మారణ హోమంపై డాక్యుమెంటరీని రూపొందించి ప్రచారం చేసిన బీబీసీపై కక్ష పూరితంగా వ్యవహరించింది. ప్రభుత్వానికి కంటగింపుగా మారిన సోషల్‌ మీడియాను నియంత్రించడానికి ఒక అధికారిక ప్యానెల్‌ను కూడా రూపొందించింది. పౌరసత్వ సవరణ చట్టం, వ్యవసాయ నల్ల చట్టాలు, బ్యాంకింగ్‌ సవరణ చట్టం, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం, పాఠ్యపుస్తకాలను మార్చడం, ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మతవిద్వేషాలను రగిలించేలా తాజాగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) తుట్టెను కదపడం ఇవన్నీ ఒక క్రమ పద్దతిలో ప్రజాస్వామ్యంపై చేస్తోన్న దాడులే. తన ప్రభుత్వం కేవలం మెజారిటీ మతానికి సంబంధించినదే అనేలా రూపొందించిన కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొనడం ప్రజాస్వామ్య వ్యతిరేకతను బహిరంగంగానే ప్రదర్శించడమే. రాహుల్‌ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు కూడా ఈ చర్యల్లో భాగమే. ఇటీవల ఏకంగా పాఠశాల స్థాయిలో ప్రజస్వామ్యం అంశాన్ని సిలబస్‌ నుంచి తొలగించడం కూడా గమనించదగిన పరిణామం.
ఈ క్రమంలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమా అనే చర్చ తీవ్రమైంది. వాస్తవానికి ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడటం ఇది తొలిసారి కాదు. ఇందిరా గాంధీ పాలన నేటి మోదీ ప్రభుత్వానికి భిన్నమైనదైనా ఆమె విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టయ్యింది. దాదాపు రెండేళ్ల పాటు దేశంలో నిరంకుశత్వం రాజ్యమేలింది. ఈ నిరంకుశత్వం కారణంగానే ఇందిర అధికారానికి దూరమైంది. కాబట్టి ప్రజాస్వామ్య భవిష్యత్తు దేశ ప్రజల ఆలోచనా సరళిపై ఆధారపడి ఉంటుంది. 2024లో సార్వత్రిక ఎన్నికలున్నాయి. నేడు అధికారంలో ఉన్న బీజేపీని ఓడిరచడం అసాధ్యమేమీ కాదు. తాజాగా కర్నాటక ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఎవర్జెన్సీ రూపంలో ప్రజాస్వామ్యానికి పాతరేసిన ఇందిరను గద్దె దించిన ప్రజలు మోదీని దించలేని అశక్తులు కారు. ఇప్పటికే దేశంలోని ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకమవుతున్నట్టు సంకేతాలిచ్చిన నేపథ్యంలో ప్రజా ప్రతిస్పందనపైనే ప్రజాస్వామ్య భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img