Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

నాయకుల పంతాలతో చిరు వ్యాపారుల అభివృద్ధికి తూట్లు?

విశాలాంధ్ర – కొయ్యలగూడెం: ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన ఫిష్ ఆంధ్ర యూనిట్ భాగంగా కొయ్యలగూడెం పట్టణంలోని కన్నాపురం రోడ్డులో సంత మార్కెట్ వద్ద పరింపూడి గ్రామపంచాయతీకి చెందిన స్థలంలో కొయ్యలగూడెం పట్టణంలో పూర్వకాలం నుంచి చేపల వ్యాపారం చేసుకుంటున్న మత్స్యకారులకు కనీస స్థలం లేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ గొడుగుల నీడలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఫిష్ ఆంధ్ర యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. పరింపూడి గ్రామపంచాయతీ సర్పంచ్ చొరవతో సుమారు రూ.7 లక్షల పంచాయతీ నిధులతో కొయ్యలగూడెం పట్టణంలో చేపల వ్యాపారం చేసుకుంటున్న మత్స్యకారులకు మూడు చేపల దుకాణాల ఏర్పాటుకు మార్చి నెలలో గ్రామానికి చెందిన కొంతమంది నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించి దుకాణాల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇంతలో గ్రామపంచాయతీ సర్పంచ్ కు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడికి మధ్య కలహాలు రావడంతో మత్స్యకారుల కోసం నిర్మిస్తున్న దుకాణాలు మధ్యంతరంగానే నిలిచిపోయాయి. మత్స్య శాఖ జిల్లా అధికారులు కూడా దుకాణాలు నిర్మాణం చేపట్టే స్థలానికి చేరుకుని మత్స్యకారులకు రుణాలు అందజేస్తామని తమకు రుణాలు ఇవ్వటానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మత్స్యకారులకు ఫిష్ ఆంధ్ర యూనిట్లు మంజూరు చేసి వారి అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుందని ఏప్రిల్ నెలలో వచ్చి మత్స్యకారులకు మంజూరు పత్రాలను అందజేసి వెళ్లడం జరిగింది. అప్పటినుండి నాయకుల పంతాలతో చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కరవమంటే కప్పకి కోపం వదలమంటే పాముకి కోపం అన్నట్లుగా మత్స్యకారులు వారి గోడును ఎవరికి చెప్పుకోలేక పలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా స్పందించి సంబంధిత అధికారులు, నాయకులు కలసి చిరు వ్యాపారుల అభివృద్ధికి కృషి చేయాలని మత్స్యకారులు, గ్రామస్తులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img