హైదరాబాద్: వెల్స్పన్ గ్రూప్, తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం ద్వారా, చేవెళ్ల మండలం పామెన గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి పీఎంఆర్ హాస్పిటల్స్‌తో చేతులు కలిపింది. గ్రామస్థులకు సమగ్ర వైద్యసేవలు అందించడమే దీని లక్ష్యం. ఈ భారీ ఆరోగ్య శిబిరాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్లతో సహా ఎనిమిది వేర్వేరు విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణుల బృందం లబ్ధిదారులకు తమ నైపుణ్యం, సహాయాన్ని అందించడానికి కలిసి వచ్చింది.