విశాలాంధ్ర – ఏలూరు : ఈనెల 11 నుంచి 17 వరకు నోయిడా (ఢిల్లీ ఎన్ సి ఆర్) లో జరగనున్న యూత్ జూనియర్ ,సీనియర్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు జడ్జిగా ఏలూరునకు చెందిన అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ రిఫరీ బడేటి వెంకట్రామయ్య ఎంపిక అయ్యారు.
గతంలో కూడా అనేక అంతర్జాతీయ ,జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు న్యాయ నిర్ణేతగా బడేటి వెంకట్రామయ్య వ్యవహరించారు.
బడేటి వెంకటరామయ్య ప్రస్తుతం ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ కు ఉపాధ్యక్షులుగా,
ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా, పశ్చిమగోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.
నోయిడాలో జరగనున్న వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు జడ్జిగా ఎంపికైన బడేటి వెంకట్రామయ్యకు
జిల్లా ,రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు ,సీనియర్ వెయిట్ లిఫ్టర్లు అభినందనలు తెలిపారు.