Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సెతల్వాద్‌కు ఊరట

బాధితులను ఆదుకోవడం, వారు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కడానికి తోడ్పడడం, అన్ని విధాలా బలవంతులైన పాలకులను నిలదీయడానికి, వారిని బోనెక్కించడానికి సాహసించడం ప్రపంచం లోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సులభంగా జరిగే పనికాదు. 2002లో గుజరాత్‌ మారణకాండ కొనసాగుతుంటే ఆ రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్న నరేంద్రమోదీ అల్లర్లను ఆపడానికి ప్రయత్నించక పోగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముస్లింలను ఊచకోత కోయడానికి వెసులుబాటు కల్పించడం లాంటివాటిని రుజువు చేయడానికి నానా యాతనాపడడానికి సిద్ధ పడేవారు కష్టాల పాలు కాక తప్పడం లేదు. ఎహసాన్‌ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీకి న్యాయం కలిగేట్టు చూడాలన్న సంకల్పం వీడనందువల్ల ప్రసిద్ధ మానవ హక్కుల కార్యకర్త, పత్రికా రచయిత, న్యాయవాది తీస్తా సెతల్వాద్‌ కు కోర్టు మెట్లెక్కీ దిగడంతోనే సరిపోతోంది. అడపా దడపా ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోంది. మారణ కాండను నిరోధించవలసిన రాజ్యాంగ బాధ్యతను విస్మరించిన వారు అందలాలెక్కారు కానీ బాధితులకు అండగా నిలబడే తీస్తా సెతల్వాడ్‌ లాంటి వారు కష్టాల పాలవుతున్నారు. ఏదో ఒక సాకుతో ఆమెను ఎంతకాలం వీలైతే అంతకాలం జైలులో ఉంచడానికి గుజరాత్‌ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇదే కేసులో సుప్రీంకోర్టు సెతల్వాద్‌ను రెండోసారి ఆదుకుంది. గుజరాత్‌ హైకోర్టు ఆమెకు బెయిలు ఇవ్వడానికి పదే పదే నిరాకరిస్తోంది. అలాంటి సమయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించక తప్పదు. ఇలాంటి స్థితిలోనే తీస్తా సెతల్వాద్‌ ను ఈ నెల 19 దాకా అరెస్టు చేయడానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంటే గుజరాత్‌ హైకోర్టు సెతల్వాద్‌కు బెయిలు మంజూరు చేయడానికి నిరాకరిస్తోంది. ఆమె తక్షణం లొంగి పోవాలని కూడా గుజరాత్‌ హైకోర్టు ఆదేశించింది. అప్పుడు తీస్తా సెతల్వాద్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. ఇదే అంశంపై స్వల్ప కాలంలో సుప్రీంకోర్టు రెండుసార్లు సెతల్వాద్‌కు ఊరట కలిగించింది. గుజరాత్‌ మారణకాండకు సంబంధించిన కేసులు తెమలకుండా, సుదీర్ఘ కాలం కొనసాగేట్టు చేయడానికి సెతల్వాద్‌ ప్రయత్నిస్తున్నారని ఇంతకు ముందు న్యాయ మూర్తులే వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరం. జకియా జాఫ్రీ లాంటి వారికి న్యాయం దక్కేట్టు చేయడానికి రెండు దశాబ్దాల పై నుంచి సెతల్వాద్‌ నిర్విరామంగా పాటు పడుతుండడం కొంతమంది న్యాయమూర్తులకు కూడా సాగదీయంగా కనిపించడం విచిత్రం. బెయిలుకు సంబంధించి సుప్రీంకోర్టు అనేకసార్లు అనుసరించ వలసిన సూత్రం ఏమిటో స్పష్టం చేసింది. అయినా అనేక కేసుల్లో, ముఖ్యంగా ప్రభుత్వం ఎవరినైతే వేధించదలచుకుందో వారికి బెయిలు దక్కడం దుర్లభంగానే ఉంది. బెయిలు హక్కు అనీ, అత్యవసరం అయితేనే జైలులో ఉంచాలని సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చెప్పినా బెయిలు సంపాదించ డానికి భీకర న్యాయపోరాటం చేయవలసి వస్తోంది. కీలకమైన కేసుల్లో ఎంత ప్రయత్నించినా బెయిలు మంజూరు కావడం లేదు. పోనీ ఇలాంటి కేసుల్లో విచారణ జరుగుతోందా అంటే అదీలేదు. నిందితులు విచారణలో ఉన్న ఖైదీలుగా నిరవధికంగా జైళ్లల్లో మగ్గి పోవలసి వస్తోంది. మరి కొన్ని సందర్భాలలో సుప్రీంకోర్టుకెక్కినా బెయిలు మంజూరు కాని ఉదంతాలూ లేకపోలేదు. ఈ స్థితిలో తక్కువ వ్యవధిలో సుప్రీంకోర్టు తీస్తా సెతల్వాద్‌ ను అరెస్టుచేయకుండా నిలిపివేయడం సానుకూలమైన అంశమే. మామూలుగా జరిగిపోవలసిన విషయాలు కూడా జటిలంగా మారినప్పుడు చిన్న ఊరట దక్కినా మహదానందపడి పోవలసిన స్థితిలో మన వ్యవస్థ ఉంది. మారణ కాండకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధ్యులైన వారి మీద ఆరోపణలు త్వరితంగా తేలిపోతున్నాయి తప్ప బాధితుల తరఫున పోరాడే వారికి పాట్లు తప్పడం లేదు.

తీస్తా సెతల్వాద్‌ కు ప్రతికూలంగా గుజరాత్‌ హైకోర్టు తీర్పు చెప్పిన అరోజే ఆమె గోడు వినడానికి అత్యున్నత న్యాయస్థానం బెంచి ఏర్పాటు చేయడం, ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచి ఈ కేసులో భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే సుప్రీంకోర్టు తక్షణం స్పందించడం మహత్తర విషయంగానే కనిపిస్తుంది. కానీ సెతల్వాద్‌ వ్యవహారమే ప్రత్యేకమైంది. ఆమెను వీలైనంత కాలం నిర్బంధంలో ఉంచాలని ప్రయత్నం జరుగు తోంది. ఇలాంటి స్థితిలో ఆమె వాదన విని ఆదుకోవడంద్వారా అత్యున్నత న్యాయస్థానం తన ఔన్నత్యాన్ని నిలబెట్టుకుంది తప్ప సెతల్వాద్‌ కోసం ప్రత్యేక ఏర్పాటు ఏమీ చేయలేదు. సెతల్వాద్‌ గుజరాత్‌ జకియా జాఫ్రీ కేసును సాగదీయడానికి ప్రయత్నిస్తోంది అని న్యాయస్థానం వ్యాఖ్యానించిందే తడవుగా పోలీసులు సెతల్వాద్‌తో పాటు ఇద్దరు మాజీ ఐ.పి.ఎస్‌. అధికారులు – ఆర్‌.బి.శ్రీకుమార్‌, సంజీవ్‌ భట్‌ మీద బూటకపు సాక్ష్యాలను పోగు చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేశారు. సెతల్వాద్‌ సాక్షులకు నూరిపోసి గుజరాత్‌ ప్రభుత్వ ఉన్నతాధికారులకు, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని బలవంతపెడ్తున్నారన్న ఆరోపణలు కూడా పోలీసులు సునాయంసంగానే మోపారు. సెతల్వాద్‌ వ్యవహారాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తే హై కోర్టు ప్రవర్తన విచిత్రంగా కనిపిస్తోంది.
ఆమె తాత్కాలిక బెయిలు కోసం దరఖాస్తు చేసుకుంటే హైకోర్టులో గత సంవత్సరం ఆగస్టు మూడు నుంచి సెప్టెంబర్‌ 19 దాకా సుదీర్ఘ కాలం పాటు విచారణ జరిగింది. ఈ లోగా సెతల్వాద్‌ రెండు నెలలకు పైగా జైలులో గడపవలసి వచ్చింది. నిర్బంధంలో ఉండగానే ఆమెను ప్రశ్నలతో వేధించారు. ఈ కేసులో ప్రశ్నించడం, చార్జ్‌ షీట్‌ కూడా దాఖలైంది కనక బెయిలు మంజూరు చేయడానికి అభ్యంతరం ఉండకూడదు. ఆమెకు సాధారణ బెయిలు విషయం దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. కానీ ఆమె మీద ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి కనక బెయిలు మంజూరు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఆమెకు బెయిలు మంజూరు చేస్తే మతపరమైన చీలికలు వస్తాయట. తొమ్మిది నెలలు జైలులో గడిపిన వ్యక్తి లొంగి పోవడానికి ఒక్క రోజుకూడా గడువు ఇవ్వకపోవడం విచిత్రం.
వ్యక్తిగత స్వేచ్ఛకు అవకాశం ఇస్తేనే నిందితులు న్యాయంకోసం పోరాడడం సాధ్యం అవుతుందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు హైకోర్టు వినిపించుకున్న దాఖలాలు లేవు. హైకోర్టు తనకు బెయిలు నిరాకరించి నప్పుడు సెతల్వాద్‌ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అత్యున్నత న్యాయస్థానం గుజరాత్‌ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. మామూలు నేరస్థుడికి కూడా బెయిలు మీద విడుదలయ్యే హక్కు ఉందని జులై ఒకటిన ముగ్గురు సభ్యులుగల సుప్రీంకోర్టు బెంచి వ్యాఖ్యానించింది. తాత్కాలికంగా సమ కూరిన వెసులుబాటును కొనసాగించాలని నిందితురాలు ప్రయత్నిస్తున్నారని అదనపు సోలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు వాదించడం మరీ విడ్డూరం. నిజానికి ఈ సారి గడువు కోరింది గుజరాత్‌ ప్రభుత్వం తప్ప నిందితురాలు కాదు. వచ్చే 19వ తేదీన రెండు పక్షాలకు తమ వాదన వినిపించడానికి చెరో గంట గడువిచ్చి ఆ రోజే విచారణ ముగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిలుకు సంబంధించిన విధి విధానాలు అన్ని కోర్టుల్లో ఒకే రకంగా ఎందుకు ఉండవో అర్థం కాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img