గురుగ్రామ్: 99 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటీష్ ఆటోమొబైల్ బ్రాండ్ ఎంజి మోటార్ ఇండియా, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) లెవెల్ 2తో కొత్తగా అభివృద్ధి చేసిన వేరియంట్ జడ్ఎస్ ఈవీని ప్రత్యేక పరిమితకాలపు ధర రూ.27.89 లక్షలకు నేడు విడుదల చేసింది. అటానమస్ లెవల్ 2అడాస్ ఫీచర్ల సెట్ వివిధ డ్రైవింగ్ పరిస్థితులలో సహాయాన్ని, నియంత్రణను, సౌకర్యాన్ని అందించడం ద్వారా డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఎంజి జడ్ఎస్ ఈవీ విద్యుత్ శక్తి, ఇంటర్నెట్ కనెక్టివిటీ, స్వయంప్రతిపత్తి సామర్థ్యాలను అనుసంధానం చేయడం ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిణామాన్ని ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన ఎస్యువి చక్కని ఆన్-రోడ్ రూపాన్ని, డ్రైవింగ్ సౌలభ్యంతోపాటు విలాసవంతమైన ఖరీదైన ఇంటీరియర్స్‌ను అందిస్తుంది.