విశాలాంధ్ర -రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని బ్యాంకు సొమ్మును కాజేసిన ఘనుడు ఘనత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాలలోకి వెళితే పట్టణంలోని భారతీయ స్టేట్ విధులు నిర్వహిస్తున్న బ్యాంక్ మేనేజర్ ఫణి కుమార్ బ్యాంకు డబ్బును తన తల్లి ఖాతాలోకి కోటి 30 లక్షలు పైగానే అకౌంట్ ద్వారా మళ్ళించినట్లు ఉన్నత అధికారులు వెంకటేశ్వరరావు చేపట్టినవిచారణలో రుజువు కావడంతో మేనేజర్ పై కేసు నమోదు చేశారు స్థానిక పోలీస్ స్టేషన్లో మేనేజర్ పై కేసు నమోదు చేశారు ఖాతాదారుల సొమ్మును బ్యాంక్ అధికారులు చేతివటం చూపించడంతో స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు ఆందోళన దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు పరారీలో ఉన్న మేనేజర్ ను అరెస్ట్ చేయడానికి రాయదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ ప్రత్యేక బలగాలను బరిలోకి దింపారని తెలియజేశారు