విశాలాంధ్ర ధర్మవరం:: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తాలూకా క్యాలెండర్లను జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆర్డీవో రమేష్ రెడ్డి చేతులమీదుగా క్యాలెండర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా మనము ప్రజలకు అన్ని రకాల సేవలు అందించినప్పుడే ప్రజల వద్ద మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఉద్యోగులు పారదర్శకతో సేవాభావంతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాలూకా అధ్యక్షులు సాయి ప్రకాష్, కార్యదర్శి ఓబులేసు, జిల్లా ఉపాధ్యక్షులు ,తాలూకా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.