Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

శ్వేతపత్రం అంతా వక్రీకరణలే

డా.జ్ఞాన్‌ పాఠక్‌
పార్లమెంటులో మోదీ ప్రభుత్వం యూపీఏ పాలనపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రమంతా వక్రీకరణలే. ఇదంతా న్యాయవిరుద్దమైంది. అంతేకాదు, అపహాస్యం పాలైంది. పదేళ్ల తర్వాత నిద్రలేచి ఏదో ఒకటి వండి వడ్డించింది. పార్లమెంటు సమావేశాలు రెండు రోజుల్లో ముగుస్తాయనగా మరో ప్రభుత్వాన్ని ఎన్నుకోవలసిన సందర్భంలో మోదీ ప్రభుత్వం ఈ శ్వేతపత్రాన్ని సమర్పించి చేతులు కడిగేసుకుంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. మోదీ ప్రభుత్వం వచ్చిననాటి నుంచి యూపీఏ ప్రభుత్వంపై రకరకాలుగా ఉన్నవీ లేనివీ ఇందులో చేర్చారు. మరికొన్ని వారాల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. ప్రజలకు శ్వేతపత్రం వాస్తవాలను తెలియజేయడం కోసం పార్లమెంటులో చదవాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం పదవీకాలం పూర్తికానున్నది. శ్వేతపత్రం వాస్తవ లక్ష్యాన్ని విస్మరించింది. 2014లో మోదీ ప్రభుత్వం ఏర్పడిరది. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014వరకు కొనసాగింది. వాస్తవంగా నూతన ప్రభుత్వం ఏర్పడినప్పుడే శ్వేతపత్రం విడుదలచేయాలి. ఆర్థిక వ్యవస్థ, పరిపాలన తదితర అంశాలపైన శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉండిరది. త్వరలో ఎన్నికలు జరిగే సమయంలో మోదీ ప్రభుత్వం టక్కుటమారాలను ఓటర్లపైన ప్రయోగించింది. శ్వేతపత్రం లక్ష్యం కూడా ఏ మాత్రం వాస్తవాలను ప్రతిబింబించలేదు. అంటే శ్వేతపత్రం ఎందుకూ పనికిరానిదని భావించాలి. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న సంక్షోభ పరిస్థితిని మోదీ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. శ్వేతపత్రానికి ఏమాత్రం విలువలేదు. ఇది కేవలం రాజకీయ ప్రచారమే. చేసిన తప్పులన్నింటినీ సమర్థించుకోవడం కోసమే సరిపోయింది. దేశంలో సుస్థిర ఆర్థికవ్యవస్థ ఉన్నదని తప్పులను సమర్థించుకుంటున్నారు. రాజకీయ ప్రచారాన్ని శ్వేతపత్రం అని చెప్పుకోడానికి ఏమాత్రం అర్హతలేదు. అందువల్ల ప్రజలు వాస్తవాలు తెలుసుకునేందుకు ఈ పత్రాన్ని విడుదల చేయాలి. దేశంలో ప్రతికూల ప్రచారాన్ని ప్రజలకు తెలియకుండా ఉండేందుకు ఈ పత్రాన్ని విడుదల చేశారు. అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్నదని మోదీ ప్రభుత్వం చెబుతోంది. వాస్తవంగా యూపీఏ ప్రభుత్వం సాధించిన అన్ని విషయాలలో మోదీ ప్రభుత్వం వెనుకబడి ఉంది. మోదీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలోని అంశాలను చూద్దాం.
క్షీణదశ ఆనాడు నెలకొని ఉన్నదని చెప్పడమే ఈ పత్రం ఉద్దేశం. ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు తెలుసుకోకుండా చేయడానికే ఈ శ్వేతపత్రం. యూపీఏ ప్రభుత్వం ఆర్థికంగా క్షీణించిందని చెప్పడమే ఈ శ్వేతపత్రం లక్ష్యం. 200414వరకు ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని ఈ పత్రం ఆరోపించింది. ప్రస్తుతం ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోకుండా ఉండేందుకే ఈ పత్రాన్ని పార్లమెంటులో చదివారు. 100 రోజుల్లోపు మోదీ ప్రభుత్వం గడువు ముగుస్తుంది. ఎన్నికల తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడుతుంది. శ్వేతపత్రం ఏ మాత్రం విలువైనదికాదు. పూర్తిగా వక్రీకరణతో నిండిరది. యూపీఏ ప్రభుత్వ పనివిధానాన్ని, సామర్థ్యాన్ని తక్కువచేసి చూపించడానికే ఈ పత్రం దోహదంచేస్తుంది. సుదీర్ఘ ప్రసంగాలు చేయడం, అసత్యాల ప్రచారాలు, అనేక జిమ్మిక్కులు మోదీ ప్రభుత్వ హయాంలో అత్యధికంగా జరిగాయి. ప్రచారాల్లో వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారు. ఆకలి, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, పేదరికం అత్యధిక ప్రజలు అనుభవిస్తున్నది వాస్తవం. కాంగ్రెస్‌ నాయకుడు కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ, వాస్తవాలు తెలియకుండా ఉండేందుకే ఈ శ్వేతపత్రం తయారు చేశారని అన్నారు. మోదీ పాలించిన పదేళ్లకాలంలోనూ అభివృద్ధి అనేది శూన్యం. యూపీఏ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి సాధించలేదని వేణుగోపాల్‌ అన్నారు. యూపీఏ ప్రభుత్వం నాటికంటే మోదీ ప్రభుత్వంలో ధనికులు, బ్యాంకులకు చెల్లించవలసిన బకాయిలను ఎక్కువగా రద్దుచేశారు. ప్రపంచంలో భారత ఆర్థికవ్యవస్థ ఐదోస్థానానికి వేగంగా చేరుకోనున్నదని 59పేజీల పత్రంలో పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలపైన పత్రంలో పేర్కొన్నవన్నీ తప్పుల తడకలే. యూపీఏ ప్రభుత్వకాలంలో సగటు తలసరి జీడీపీ వృద్ధిని పేర్కొనలేదు. యూపీఏ ప్రభుత్వ సగటు తలసరి జీడీపీ వృద్ధి 5.9శాతం కాగా, మోదీ పాలనలో అది 3.8శాతానికి దిగజారింది. విదేశీ పెట్టుబడులను కూడా వక్రీకరించింది. యూపీఏ కాలంలో నికర విదేశీ పెట్టుబడులు జీడీపీలో 1.2శాతం ఉండగా, మోదీ కాలంలో అది 0.8శాతం మాత్రమే నమోదైంది. అలాగే యూపీఏ పాలనలో విదేశీ నిల్వలు మోదీ పాలనకంటే మూడురెట్లు ఎక్కువ కాగా, ఎగుమతుల వృద్ధి 17శాతం నమోదైంది. ఉత్పత్తి రంగంలో వృద్ధి 202324లో పడిపోయింది. ఆహారధాన్యాల ఉత్పత్తి యూపీఏ కాలంలో 34 శాతం కాగా, మోదీ ప్రభుత్వ హయాంలో 31శాతంగా నమోదైంది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మోదీ పాలనను ప్రశంసించేందుకే శ్వేతపత్రం వాస్తవాలను విస్మరించింది. అరకొర గణాంకాల సమాచారాన్ని పొందుపరిస్తే వాస్తవం వెల్లడికాదు. ఆత్మస్తుతికోసం అలాగే ప్రస్తుత అంశాలను గొప్పవిచేసి చెప్పుకునేందుకు శ్వేతపత్రం విడుదల చేశారు. పార్లమెంటు సమావేశాలు ముగియనుండగా, మోదీ హయాంలో పరిస్థితులను చెప్పకుండా తప్పులతోకూడిన శ్వేతపత్రాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో నిర్థిష్టమైన ప్రణాళికను అమలుచేస్తామని ప్రకటించడానికి ఈ పత్రం విడుదలచేశారు. ఈ పత్రంపైన చర్చించడానికి అవసరమైనంత సమయం లేకుండా చేశారు. రాజకీయ ఉదేశాలతోనే తగినంత సమయంలేకుండా సమావేశాలను ముగించారు. యూపీఏ పాలనలో జరిగిన మేలును ప్రస్తావించకుండా తప్పుడు పరిపాలన, అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇదంతా నల్లపత్రమని కాంగ్రెస్‌ చెపుతూ మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపింది. మోదీ పదేళ్లకాలంలో అన్యాయం, వివక్ష, సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్యాయాలు జరిగాయని 54పేజీల నల్లపత్రాన్ని కాంగ్రెస్‌ విడుదల చేసింది. మోదీ ప్రభుత్వ పదేళ్లకాలంలో ఆర్థికరంగాన్ని ధ్వంసం చేసిందని నిరుద్యోగం ఏనాడూ లేనంతగా పెరిగిందని అలాగే వ్యవసాయరంగాన్ని నాశనం చేసిందనీ, మహిళలపై నేరాలు పెరిగాయనీ, మైనారిటీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, ఈ సమస్యలన్నిటిపైన మోదీ ప్రభుత్వం మౌనంగా ఉన్నదని కాంగ్రెస్‌ నల్లపత్రం పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img