Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చేనేత బతుకులు ఛిద్రం!

.పాలకుల పోకడతో సొసైటీలు కుదేలు
. జీఎస్టీ మినహాయింపునివ్వని ప్రభుత్వాలు
. పవర్‌లూమ్స్‌ దెబ్బతో మగ్గం మౌనం
. చేయూత కరువై వృత్తిని వీడుతున్న నేతన్నలు
బ నానాటికీ పెరుగుతున్న ఆత్మహత్యలు

సంప్రదాయ వారసత్వ చేనేత కళ తప్పుతోంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీర తయారు చేసి ప్రపంచాన్నే అబ్బురపరిచిన కళాకారుల బతుకులు ప్రభుత్వ ప్రోత్సాహం లేక ఛిద్రమైపోతున్నాయి. రోజంతా కష్టపడినా బిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని దుస్థితి. ముడిసరుకుల ధరలు పెరగడం, జీఎస్టీ మినహాయింపు లేకపోవడం, పవర్‌లూమ్స్‌ పోటీ తట్టుకోలేక నష్టాల ఊబిలో కూరుకుపోతూ బతుకుపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దశాబ్దాల తరబడి సొసైటీలపై పాలకులు శీతకన్ను వేయడంతో అస్తవ్యస్తంగా మారిన చేనేత పరిశ్రమ… పన్నుల భారంతో కొట్టుమిట్టాడుతోంది. వైఎస్సార్‌ నేతన్న నేస్తం, చేనేత మిత్ర కేవలం కంటి తుడుపేనంటున్న నేత కార్మికులపై విశాలాంధ్ర ప్రత్యేక కథనం…

విశాలాంధ్ర – డిజిటల్‌: భారతదేశంలో వ్యవసాయ రంగం తరువాత అధికశాతం మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది చేనేత రంగం. అన్నంపెట్టే రైతన్న ఎంత అవసరమో, వస్త్రాన్ని అందించే నేతన్న అంతేముఖ్యం. ప్రభుత్వాలు సరైన చేయూత నివ్వకపోవడంతో చేనేతరంగం కుదేలౌతోంది. పవర్‌లూమ్స్‌ (యంత్ర పరిశ్రమలు) రాజ్యమేలడంతో సంప్రదాయ వస్త్రాల తయారీలో చేయి తిరిగిన నేతన్నలు పోటీని తట్టుకోలేక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సంప్రదాయ, వారసత్వ వృత్తిని, కళను కాపాడుతున్న చేనేత కార్మికులు కళతప్పి బతుకులీడుస్తున్నారు. రోజంతా కష్టపడే నేతన్నలు బిడ్డలకు ఒక్కపూటైనా కడుపునిండా అన్నం పెట్టలేకపోతున్నారు. వృత్తిని వదిలి పొట్టచేతపట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు. మగ్గం శబ్దాలతో నాట్యమాడిన వీధులు నిశ్శబ్ద నిథిరాత్రిలో రోదిస్తున్నాయి. అగ్గిపెట్టెలో పట్టే ఆరు గజాల చీర తయారు చేసి ప్రపంచాన్నే అబ్బురపరిచిన మన చేనేత కళాకారుల బతుకులు ఛిద్రమైపోతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి, తీర్చే మార్గంలేక అలోలక్ష్మణా అంటూ ఆకలికేకలతో అలమటిస్తూ బతుకుపై విరక్తిచెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వేరే పనులు చేతకాక తనువు చాలిస్తున్నారు. ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరగడం, ప్రభుత్వ రాయితీలు అంతంత మాత్రంగా ఉండడం, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించకపోవడంతో పాటు దళారుల ఉచ్చులో చిక్కుకుని చిక్కిశల్యమౌతున్నారు. మూలిగే నక్కపై తాటికాయ చందాన జీఎస్టీ బాదుడుతో చేనేత కార్మికుల కుటుంబాలు బతుకు భారమై బావురుమంటున్నాయి. చేనేత ప్రయోజనాలు కాపాడేందుకు జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ ఉన్నా నాణ్యమైన నూలు సరఫరా చేయడంలోను, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంలోనూ, సబ్సిడీపై ముడిసరుకులైన దారం, రసాయన రంగులు అందజేయడంలో వైఫల్యం చెందడంతో వస్త్రాల తయారీ ఖర్చు పెరిగి, మార్కెట్‌లో గిట్టుబాట ధర లభించకపోవడంతో దళారులపై ఆధారపడి శ్రమ దోపిడీకి గురౌతున్నారు. మువ్వన్నెల జెండా నేసిన నేతన్నకు చేయూత కరువై వృత్తిని వీడి వలసపోతున్నారు.
ఇండియా హ్యాండ్లూమ్స్‌ సెన్సెస్‌ ప్రకారం భారతదేశంలో సుమారు కోటి 30 లక్షల మంది చేనేత కార్మికులు, తొమ్మిది కోట్ల మంది అనుబంధ కార్మికులు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో సుమారు 70 వేల మంది తెలంగాణలో చేనేత, అనుబంధ కార్మికులుగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పోచంపల్లి వస్త్రాలు పేరెన్నికగన్నా… కార్మికులకు మాత్రం ఆకలిచావులు తప్పడం లేదు. సిరిపురం, వెల్లంకి, రఘునాథపురం, చౌటుప్పల్‌, కొయ్యలగూడెం, సంస్థాన్‌ నారాయణపురం, పుట్టపాక, రామన్నపేట, చుండూరు, మోత్కూరు, రాజంపేట, ఆలూరు, గుండాల, నాగారం, భోగాపురం ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు చేనేతపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. జీఎస్టీ తగ్గించాలని ఎన్నిసార్లు ఆందోళన చేసినా ప్రభుత్వాలు స్పందించలేదు. వేరే పనులు చేతగాక మగ్గాల్లోనే మగ్గుతున్నారు. 47 వేలకు పైబడి మగ్గాలు ఉండగా ఒక్క సిరిసిల్లలోనే 30 వేలకు పైబడి చేనేత కార్మికులు పనిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రెండున్నర లక్షల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. ధర్మవరం, వెంకటగిరి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని, గుడేకల్లు, నాగలదిన్నె, నందవరం, కోసిగి, నంద్యాల, కర్నూలు, ఉప్పాడ, చీరాల, మంగళగిరి, బందరు, గూడూరు, పెడన, ఘంటసాల, చల్లపల్లి తదితర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు చేనేత వృత్తిపై మనుగడ సాగిస్తున్నాయి. చేనేత సొసైటీలకు ప్రభుత్వ ప్రోత్సాహం సక్రమంగా లేకపోవడం, నాణ్యమైన నూలు కొరత, యార్న్‌ సరఫరా చేయకపోవడం, ఆప్కో ద్వారా కొనుగోళ్లు, రాయితీలు, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించకపోవడంతో నష్టాల ఊబిలో కూరుకుపోతూ బతుకుభారం మోయలేక తనువు చాలిస్తున్నారు. దీనికి కరోనాకాలం తోడుకావడంతో నేతన్నల కలలు కల్లోలమయ్యాయి. నేత పరిశ్రమలు మూతపడడంతో వృత్తినే నమ్ముకున్న అనేక కుటుంబాలు వీధినపడ్డాయి. భారతదేశానికి గర్వకారణంగా చెప్పుకునే చేనేత కళాసంపద శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఏర్పడిరది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో సరైన కేటాయింపులు చేయకపోవడంతో పెట్టుబడి సమస్యతో ముడిసరుకుల కొనుగోలుకు వడ్డీ వ్యాపారులపై ఆధారపడక తప్పడం లేదు. మార్కెటింగ్‌ సౌకర్యం లేక తాము తయారు చేసిన చీరలు అమ్ముకునేందుకు దళారులపై ఆధారపడవలసిన దుస్థితి ఏర్పడిరది. సిల్క్‌, కాటన్‌ నూలు, రసాయనాల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరిగి పవర్‌లూమ్స్‌ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండడంతో పోటీని తట్టుకోలేక నష్టాలకే తమ ఉత్పత్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. దశాబ్దాల తరబడి అస్తవ్యస్తంగా ఉన్న చేనేత పరిశ్రమ పన్నుల భారంతో కొట్టుమిట్టాడుతోంది.
పన్నుల విధానం వల్ల చేనేతరంగం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. 22 రకాల ఉత్పత్తులను 11కు కుదించినా వాటిని పరిరక్షించడంలో ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందడంతో చేనేత కళాకారులు కుదేలౌతున్నారు. ఉభయ తెలుగురాష్ట్రాలు అందిస్తున్న సాయం కంటితుడుపు మాత్రమేననీ, ఎన్నికల స్టంట్‌ కాకుండా అర్హులందరికీ సబ్సిడీ రుణాలిచ్చి, జీఎస్టీ నుంచి మినహాయించి చేనేత వస్త్రాలు ప్రభుత్వమే కొనుగోలు చేసి అండగా నిలిస్తే ఆకలిచావులు తగ్గి పరిశ్రమకు పూర్వవైభవం వస్తుందని నేతన్నలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img