Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నాటో, విదేశీ స్థావరాలు వద్దు

. సైప్రస్‌ కమ్యూనిస్టుల ఆందోళన
. నికోసియాలో ఆందోళన
. పలస్తీనాకు సంఫీుభావం
. యెమన్‌లో రక్తపాతానికి ఖండన

నికోసియా: దేశంలో నాటో, విదేశీ సైనిక స్థావరాలు వద్దని సైప్రస్‌ కమ్యూనిస్టులు డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌తో బ్రిటన్‌ హై కమిషన్‌ ఎదుట సైప్రస్‌ కమ్యూనిస్టు ఇనిషియేటివ్‌ (సీసీఐ) అధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. పలస్తీనియా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌ మారణహోమం, యుద్ధ నేరాలను నిరసనకారులు తీవ్రంగా ఆక్షేపించారు. యెమన్‌లో రక్తపతాన్ని ఖండిరచారు. బ్రిటిష్‌ స్థావరాల ద్వారా సైప్రస్‌ కూడా మారణహోమంలో భాగస్వామి కావడాన్ని వ్యతిరేకించారు. ఇలాంటి పరిణామాలతో ప్రభుత్వానికి మరిన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురువుతున్నట్లు వెల్లడిరచారు. ఎర్ర సముద్రంలో ఈయూ సైనిక చర్యల్లో సైప్రస్‌ పాల్గొనడాన్ని ఖండిరచారు. ర్యాలీలో సీసీఐ ఎగ్జిక్యూటివ్‌ కార్యదర్శి క్రిస్టోస్‌ కౌర్టోల్లారిస్‌ మాట్లాడుతూ మన దేశం నుంచి నాటో, ఈయూ దళాలను ఉపసంహరించేంత వరకు, విదేశీ సైనిక స్థావరాలను తొలగించేంత వరకు పోరాడదామని పిలుపునిచ్చారు.బ్రిటిష్‌ సైనిక స్థావరాలకు వ్యతిరేకంగా పోరు సాగిస్తున్నట్లు తెలిపారు. బ్రిటష్‌ స్ధావరాలు తమ దేశానికి సిగ్గు చేటన్నారు. తమ దేశం ఓ పర్యవేక్షణ కేంద్రంగా మారిందని, రక్తపాతాన్ని కొనసాగించేందుకు కేంద్రంగా ఉన్నదని దుయ్యబట్టారు.
బ్రిటిష్‌ స్థావరాల మూసివేతకు డిమాండ్‌ చేశారు. పలస్తీనియన్లకు సంఫీుభావం ప్రకటించారు. టర్కీ ఆక్రమిత భూభాగాల్లో సైనికీకరణపై ప్రభుత్వ మౌనాన్ని ప్రశ్నించారు. హంతకులకు భూమి, గాలీ, నీరు అందరాదని నిరసనకారులు నినదించారు. పెత్తందారీ విధానాలతో ముడి పెట్టుకొంటే ఎవరూ విజయం సాధించలేరన్నారు. సైప్రస్‌ దీర్ఘకాలిక సమస్య విషయంలో బ్రిటిష్‌ హై కమిషన్‌ కవ్వింపులను ఆక్షేపించారు. తక్షణమే విదేశీ సైనిక స్థావరాలను మూసివేయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img