హైదరాబాద్: ఉత్కంఠ రేకెత్తించే కథనం, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగు యాక్షన్-ప్యాక్డ్ డ్రామా స్కంద ఇప్పుడు టాటా ప్లే తెలుగు సినిమాలో ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులోకి వస్తోంది. ఈ సినిమా కథనంలోని ఎత్తులు, పైఎత్తులు, వ్యక్తిగత వివాదాలు, రాష్ట్ర రహస్యాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్న రాజకీయ చదరంగం అనే ఆటలోకి తీసుకువెళుతుంది. ఆకర్షణీయమైన నటుడు రామ్ పోతినేని, రైజింగ్ స్టార్స్ శ్రీలీల, సాయీ మంజ్రేకర్‌లతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చక్కని గుర్తింపు తెచ్చుకున్న చెందిన ప్రిన్స్ సెసిల్, మేకా శ్రీకాంత్, శరత్ లోహితాశ్వ అభిమానులు కథలో లీనమయ్యేలా, తమ పాత్రలలో జీవించి సినిమాకు న్యాయం చేశారు. స్కందను అద్భుతమైన నటన, ఆకర్షణీయమైన కథనం, హృదయాన్ని కదిలించే యాక్షన్ సినిమా అని చెప్పవచ్చు.