బెంగుళూరు: ‘కస్టమర్-ఫస్ట్ అప్రోచ్’ పట్ల తమ నిబద్ధతకు అనుగుణంగా మరియు విలువ ఆధారిత సేవల ద్వారా అద్భుతమైన కొనుగోలు అనుభవాన్ని సృష్టించటంలో భాగంగా టొయోటా కిర్లోస్కర్ మోటర్ ప్రైవేట్ లిమిటెడ్ (టొయోటా కిర్లోస్కర్ మోటర్/టికెఎం) తాజాగా తమ ‘ఆసమ్ న్యూ కార్ డెలివరీ సొల్యూషన్’ను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. టికెఎం అధీకృత డీలర్లు వారి విక్రయ ప్రక్రియలో భాగంగా దీనిని అమలు చేయబోతున్నారు. డీలర్ సిబ్బంది కొత్త కార్లను డెలివరీ చేసే ప్రదేశానికి డ్రైవింగ్ చేయడాన్ని తొలగింపు ద్వారా డెలివరీ టచ్పాయింట్ల వరకు వాహన లాజిస్టిక్ సేవలను విస్తరించడం కొత్త కార్యక్రమ లక్ష్యం. కొత్త కార్యక్రమంతో టొయోటా డీలర్లు కొత్త వాహనాలను డీలర్ స్టాక్యార్డ్ల నుండి తమ విక్రయ కేంద్రాలకు ఫ్లాట్-బెడ్ ట్రక్కులో రవాణాకు వీలు కల్పిస్తుంది.