న్యూఢల్లీి: తమ ఇండస్ యాప్‌స్టోర్‌ను వినియోగదారుల కోసం ఆవిష్కరిస్తున్నామని ఫోన్‌పే గురువారంనాడు న్యూఢల్లీిలోని భారత మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించింది. ఇండస్ యాప్‌స్టోర్ అనేది భారతదేశం కోసం మరింత సమర్థవంతమైన, స్థానికీకరించిన మొబైల్ యాప్ స్టోర్ ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు ఫోన్‌పే చేస్తున్న ప్రయత్నమని చెప్పవచ్చు. ఇప్పటికే అది ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ యాప్‌ల డౌన్లోడ్ మార్కెట్‌గా నిలుస్తోంది. పెద్ద సంఖ్యలో స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, టెక్ పరిశ్రమ దిగ్గజాలు హాజరైన ఈ కార్యక్రమంలో దీనిని ఆవిష్కరించడం ద్వారా భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ వాతావరణ వ్యవస్థకు ఈ ఆవిష్కరణలకున్న ప్రాముఖ్యతను చాటుతోంది. ఇండస్ యాప్‌స్టోర్ 45 విభాగాలకు చెందిన 2 లక్షలకు పైగా మొబైల్ యాప్‌లు, గేమ్‌లను డౌన్లోడ్ చేసుకునేందుకు భారతీయ వినియోగదారులను అనుమతిస్తుంది. యూజర్లు ఈ యాప్‌లను 12 భారతీయ భాషల్లో సులభంగా గుర్తించవచ్చు.