Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సిక్కులను అవమానించిన బీజేపీ

సిక్కులంతా ఖలీస్థానీలని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నాయకులు అవమానిస్తోంది. తమ భావజాలం పరిధిలోకి సిక్కులు రాకపోవడం వల్లనే అవమానిస్తున్నారు. కాషాయ దళాలకు అంగీకృతులు కావాలంటే మోహన్‌ భగవత్‌, నరేంద్ర మోదీలు చెప్పినవి వినాలి. హిందూత్వను అనుసరించాలి. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు తమ అభిప్రయాలకు అనుగుణంగా మెజారిటీ హిందూత్వ సమాజంలోకి కలుపులోకి పోయాయి. దేశంలోనేగాక, ప్రపంచవ్యాప్తంగా సిక్కులను ఖలీస్థానీలుగానే కాషాయదళాలు భావిస్తాయ. వాస్తవంగా ప్రపంచమంతటా సిక్కులపై ఇదేవిధమైన ప్రచారం సాగిస్తున్నారు. నరేంద్ర మోదీపైన ఏమైనా వ్యాఖ్యానిస్తే వారిని ఖలీస్థానీలని పిలుస్తారు. ఈ కారణంగానే మనదేశానికి కెనడాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. దేశంలో ప్రధాన స్రవంతి నుంచి సిక్కులను వేరుగా ప్రభుత్వం చూస్తోంది. రైతులు ఈ నెల 13న పంటలకు కనీసమద్దతు ధరను చట్టబద్దం చేయాలని రైతులు మరోసారి పోరాటం ప్రారంభించారు. ఇతర రైతుల నుంచి సిక్కు రైతులను వేరు చేయాలని మోదీ ప్రభుత్వం కుట్రపన్నుతోంది. సిక్కులు దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వారు ఖలీస్థానీలుగా పిలుస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో సందేశ్‌ఖలీ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న స్పెషల్‌ ఎస్‌పీ జస్‌ప్రీత్‌సింగ్‌ను సీనియర్‌ బీజేపీ నాయకుడు సుబేందు అధికారి నాయకత్వంలో కొంతమంది బీజేపీ నాయకులు పోలీసుల ఉన్నతాధికారి అని కూడా చూడకుండా ఖలీస్తానీ అని అన్నారు. అంతేకాదు, ఆయన ఫొటోతీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఆ తరువాత సింగ్‌ను బసిర్‌హత్‌ పోలీసుస్టేషన్‌లో ఇంటలిజెన్స్‌ విభాగంలో స్పెషల్‌ ఎస్‌పీగా పోస్టు చేశారు. వైరల్‌ అయిన వీడియోలో సింగ్‌ గుమిగూడిన సమూహానికి సమాధానం చెబుతూ కనిపించారు. ‘‘ఈ విషయంలో చర్య తీసుకోగలను అయితే తలమీద టర్బన్‌ పెట్టుకున్నాంగనుక వెనుకాడుతున్నాం. మీరునన్ను ఖలిస్థానీ అని పిలిచారా? అంతేగాని, నామతాన్ని గురించి ఏమీ చెప్పలేరుగదా…మీ మతంపైన ఎవరైనా, ఏమైనా వ్యాఖ్యానించారా? మరి నా మతంపై ఎందుకు వ్యాఖ్యానించారు? ఏ పోలీసు అయినా వ్యక్తిగతంగా టర్బన్‌ను ధరిస్తే అలాంటివారిని ఖలిస్తానీయులని అంటారా? మీ స్థాయి ఇదేనా? అని సుబేంధు అధికారిని ప్రశ్నించారు. నిజంగా ఇది సిగ్గుచేటు. మంచి సంస్కృతి గలిగిన బెంగాలీ పౌరుడు ఇలా చేసినందుకు సిగ్గుతో తలవంచుకోవాలి. అని సింగ్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. అయితే తాను అలా అనలేదని సుబేందు అధికారి సమాధానం చెప్పారు.
అరుణ్‌ శ్రీ వత్సవ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img