Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎందుకింత అత్యుత్సాహం?

జమిలి ఎన్నికలపై మోదీ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. వారి ఆలోచనలకు అనుగుణంగా వచ్చిన కొన్ని కథనాలు అధ్యక్షపాలన దిశగా బీజేపీ ప్రభుత్వం పావులు కదుపుతున్న తీరుకు అద్దంపడుతున్నాయి. తాజాగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రుతురాజ్‌ అవస్థీ నేతృత్వంలోని న్యాయ కమిషన్‌ జమిలి ఎన్నికలపై కొన్ని సిఫార్సులు చేస్తూ ఒక నివేదికను సిద్ధం చేస్తోంది. నివేదిక ఇంకా సమర్పించకుండానే, కొన్ని కీలక సిఫార్సులంటూ వివిధ అంశాలు వెలుగులోకి వచ్చాయి. రేపోమాపో ఈ నివేదిక రాకమానదు. ఈలోగా జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ కూడా ప్రత్యేక నివేదికను రూపొందిస్తోంది. అది ఏ క్షణానైనా విడుదల కావచ్చు. జమిలిపై మోదీ తెగ ఆరాటపడుతున్న విషయాన్ని ఈ నివేదికల పరంపర చెప్పకనే చెపుతోంది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థా లేక అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థా? రాష్ట్రపతి పేరుతో దేశాధ్యక్షుడు ఉన్నంత మాత్రాన ఆ పదవి పరిధి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచిన రాజ్యాంగ నిర్మాతల ముందుచూపు మహోన్నతమైనది. మన రాజ్యాంగం ప్రకారం దేశ పార్లమెంటరీ వ్యవస్థలో సమాఖ్య వ్యవస్థ అంతర్లీనంగా కొనసాగుతూ ఉంటుంది. అదే మన ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనం. అది విజయవంతంగా సాగుతున్న దశలో 70 ఏళ్లు దాటిన తర్వాత జమిలి మంత్రాన్ని జపించడంలో అర్థం లేదు. జమిలి ఎన్నికల వల్ల కేవలం ఎన్నికల వ్యయం తగ్గుతుందని ఒకే ఒక్క కారణంతో చాలామంది న్యాయనిపుణులు తమ ఆలోచనలను అటువైపు పరుగులు పెట్టిస్తున్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగినా, కనీసం 10 వేల కోట్ల రూపాయల ఖర్చు తప్పదని గ్రహించాలి. పైగా మోదీ ఆలోచన వెనుక దాగివున్న ‘గొప్ప కుట్ర’ను న్యాయనిపుణులు గ్రహించలేకపోవడం దురదృష్టకరం. ఈసారికి ఏకకాలంలో ఎన్నికలు సాధ్యం కాకపోయినా, 2029 నుంచి జమిలి ఎన్నికలు జరుపుకోవచ్చని న్యాయ కమిషన్‌ సిఫార్సు చేయనున్నదని తెలిసింది. అంతేతప్ప జమిలి ఎన్నికలే ఉత్తమం అని సిఫార్సు చేయకుండా ఉంటుందని ఆశించడం తప్ప ఇప్పటికిప్పుడు మనం చేసేదేమీ లేదు. అయినప్పటికీ, జమిలి వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని రొడ్డకొట్టుడు మాదిరి ఒకే దృక్పథంతో తలలు బాదుకుంటున్న న్యాయ నిపుణులు గ్రహించాల్సిన అవసరమైతే అత్యవసరం.
జమిలి ఎన్నికలు బీజేపీ సిద్ధాంతాల్లో ఒకటి. ఇది సర్వవిదితం. ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలు ఏదో ఒక సందర్భంలో చెపుతూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల నిర్వహణకు పూనుకోవడంతో ఉన్నట్టుండి జమిలి తెరపైకి వచ్చింది. న్యాయ కమిషన్‌, కోవింద్‌ కమిషన్‌లకు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఇదేదో అనివార్యమైన ప్రక్రియ అని అందరికీ అర్థమైపోయింది. దేశ వ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు జరగడమే జమిలి ఎన్నికలు లేదా ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం. దేశంలో అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు కూడా ఒకే సమయంలో ఎన్నికలు జరుగుతాయన్నమాట! ఇదంత తేలికైన పని కాదు కాబట్టే రామాలయం, 370 రద్దు వంటి అజెండాలను అమలు చేసినంత త్వరగా జమిలిని బీజేపీ ప్రభుత్వం పరిపూర్తి చేయలేకపోతున్నది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ సవరణలకు లోక్‌సభలోని 543 స్థానాల్లో కనీసం 67 శాతం మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. అటు రాజ్యసభలోని 245 సీట్లలో 67 శాతం ఈ బిల్లును సమర్థించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. కనీసం 14 రాష్ట్రాలు ఈ బిల్లును సమర్థిస్తూ తీర్మానం చేయాలి. లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి దాదాపు 333 సీట్ల బలం ఉంది. 543 స్థానాలకు గానూ ఈ 333 సీట్లు అంటే 61శాతానికి సమానం… అయితే మరో 6 శాతం ఓటింగ్‌ను సంపాదించడం ఎన్డీఏ కూటమికి కష్టమే. ఇక రాజ్యసభలో ఈ మధ్యనే 56 సీట్లకు జరిగిన ఎన్నికలు కలుపుకొని ఎన్‌డీఏ బలం 117కి పెరిగిన మాట వాస్తవం. కాకపోతే మెజారిటీ మార్కు 121కి ఇంకా 4 సీట్లు తక్కువే ఉంది. క్రాస్‌ ఓటింగ్‌కు ఎంత ప్రయత్నించినా కర్నాటకలో బెడిసికొట్టడంతో బీజేపీ కాస్త అసంతృప్తికి లోనైంది. రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన 24 గంటల్లోపే జమిలిపై న్యాయకమిషన్‌ సిఫార్సుల పేరుతో కథనం విడుదలైన విషయాన్ని గమనించాలి. అసెంబ్లీల్లో బలాబలాలను పరిశీలిస్తే, 2023 ఆఖరులో ముగిసిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ, దాని మిత్రుల (ఎన్‌డీఏ) పాలిత రాష్ట్రాల సంఖ్య 17కి పెరగగా, కాంగ్రెస్‌ పార్టీ, దాని మిత్రపక్షాల (ఇండియా కూటమి) పాలిత రాష్ట్రాల సంఖ్య 9కి చేరింది. శాసనసభలు కలిగిఉన్న రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటి ఎన్‌డీఏ చేతిలోనూ, ఇంకొకటి ఇండియా కూటమి చేతిలోనూ ఉంది. ఈ మధ్యనే బీహార్‌ను పాలిస్తున్న నితీశ్‌కుమార్‌ ఎన్‌డీఏ పంచన చేరడంతో ‘ఇండియా’కు ఒక రాష్ట్రం తగ్గినట్లుగా భావించాలి. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా వంటి రాష్ట్రాలూ తటస్థంగా ఉన్నాయి. ఏపీలో ఇండియా కూటమి తప్ప ఎవరు అధికారంలోకి వచ్చినా బీజేపీ చెప్పులు మోయాల్సిందేనని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెపుతున్నారు. అందుకే న్యాయకమిషన్‌ చెపుతున్నదాని ప్రకారం, 2029 నుంచి జమిలి ఎన్నికలను అమలు చేయాలంటే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి తన బలాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే జమిలి ఎన్నికల ప్రక్రియ కార్యరూపం దాలుస్తుందా లేదా అన్నది రెండు నెలల్లో జరగబోయే ఎన్నికలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టమవుతున్నది.
ఎన్నికల నిర్వహణ వ్యయం కన్నా ఎన్నికల్లో పార్టీలు పెట్టే ఖర్చు ఎక్కువ. సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ ప్రకారం 2019 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు కలిపి దాదాపు రూ. 60 వేల కోట్లు ఖర్చుచేశాయి. దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు అవే. పార్టీల ఖర్చును తగ్గించుకోవడానికి ప్రయత్నించాలే తప్ప ఎన్నికల నిర్వహణ వ్యయం పేరుతో జమిలికి ఆస్కారమిచ్చి, నియంతృత్వ పాలన దిశగా దేశాన్ని నడిపించే యత్నాన్ని ఆపాలి. జమిలికి ఆమోదం తెలపాలంటే, రాజ్యాంగ సవరణలతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని, పార్లమెంటరీ ప్రొసీజర్లను సవరించాలి. దీనికీ రాష్ట్రాల అంగీకారం ఉండాలి. జాతీయ అంశాలకే ప్రాధాన్యత పెరిగి, స్థానిక సమస్యలు పెద్దగా పట్టవు. ప్రాంతీయ పార్టీలు పూర్తిగా తమ ప్రాధాన్యతను కోల్పోతాయి. మనమూ, మన రాష్ట్రమూ, మన అభివృద్ధి అనే మాటలే ఇకపై ఉండవు. అనివార్య కారణాల వల్ల అసెంబ్లీలు రద్దయితే, రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఐదేళ్లూ ఆ పాలనలోనే బతుకీడ్చే పరిస్థితి దాపురించవచ్చు. ఇది అత్యయిక పరిస్థితులకు దారితీస్తుంది. అసంతృప్తులు పెరిగి, ఉగ్రవాదం, తీవ్రవాదం పెరుగుతుంది. రాష్ట్రాలు తమ హక్కులన్నీ కోల్పోతాయి. కేంద్రీకృతపాలన బలపడుతుంది. సమాఖ్య వ్యవస్థ నాశనమవుతుంది. అందుకే జమిలి జనరంజకం కాదు. 1967 నాటి పరిస్థితులు ఈనాడు లేవు. జమిలి ఎన్నికలు అనేది బీజేపీ అజెండాయే తప్ప జనం అజెండా కాదని గుర్తెరగాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img