Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

పదోతరగతిలో పలితాల్లో విజయదుందుభి మోగించిన హోలీ క్రాస్ స్కూల్

విశాలాంధ్ర సీతానగరం:మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లు2002లో స్థాపించిన హోలీ క్రాస్ స్కూల్ ఉత్తమ ఫలితాలు సాధనతో పాటు ఉత్తమ విద్యను, బోధనను అందిస్తున్న సంస్థగా మంచి పేరు తెచ్చుకుంది.ఆహ్లాదకరమైన వాతావరణంలో, విశాలమైదానం, ఆదనాతన తరగతులు, పూర్తి ల్యాబ్ సౌకర్యం, పార్టీ మౌలిక సదుపాయాలు కలిగిన సంస్థగా, విద్యాసంస్థగా
ఈపాఠశాలకు పేరుఉంది. ఇక్కడ సిస్టర్స్ ఆధ్వర్యంలో బోధన కొనసాగడమే కాక క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుంది.1వ తరగతి నుండి 10వ తరగతివరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది.
ఈపాఠశాలలో 2024 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు 18 మంది హాజరు కాగా 18 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కరస్పాండెంట్ సిస్టర్ ఆనంద్ ఎర్నాకల్, ప్రిన్సిపాల్ సిస్టర్ నీలిమ గ్రేస్ బిలాంగ్ తెలిపారు. తమపాఠశాలకు చెందిన మడక గౌరీశ్వరి 577మార్కులు(బక్కు పేట),సువ్వాడ హర్షిత 566మార్కులు (సీతానగరం) ,పెద్దిరెడ్ల యామినీ 553మార్కులు (బక్కుపేట) సాధించారని ప్రిన్సిపాల్ చెప్పారు.11మంది విధ్యార్థులకు 500మార్కులుదాటిరాగా, మిగిలిన ఏడుగురుకు 480మార్కులు దాటి వచ్చినట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన, ఉత్తమ మార్కులు సాదించిన విద్యార్థినీ విద్యార్థులను కరస్పాండెంట్ సిస్టర్ ఆనంద్ ఎర్నాకల్, ప్రిన్సిపాల్ సిస్టర్ నీలిమ గ్రేస్ బిలాంగ్ లు అభినందించారు. ఉపాద్యాయసిబ్బంది, తల్లిదండ్రుల సహకారం మరువలేనిదన్నారు.క్రమశిక్షణకు, ఉత్తమ విద్యకు మారుపేరైన హోలీ క్రాస్ స్కూల్ లో 1వతరగతి నుండి 10వ తరగతివరకు అడ్మిషన్లకు సంప్రదించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img