Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అమెరికా వలస రాజకీయం

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

ఈ నెల ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన మిత్రదేశాలైన భారత్‌, జపాన్‌ల ద్వేష స్వభావంపై దౌత్యపర చిరాకు వ్యక్తపరిచారు. చారిత్రక పారదర్శక వలస విధానమే అమెరికా విజయానికి కారణమన్నారు. భారత్‌, జపాన్‌ల విదేశీవలస విముఖతే వారి ఆర్థికాభివృద్ధికి అడ్డంకి అన్నారు. అనాలోచిత మనిపించినా బైడెన్‌ సరిగ్గానే విశ్లేషించారు. జపాన్‌ ప్రవాస ద్వేషాన్ని పెంచుకుంది. భారత్‌ స్వదేశ, విదేశాల్లోని మత మైనారిటీలను, కమ్యూనిస్టులను పరాయీకరించింది. పాలక మత విదేశీయులను కూడా ప్రేమిస్తోంది.
రానున్న 50 ఏళ్లలో జపాన్‌ తన జనాభాను మూడో వంతు తగ్గించాలని ఆశ. 2080నాటికి అమెరికా జనాభా తగ్గుముఖం పడుతుందని కొన్ని నెలల క్రితం అమెరికా జనగణన సంస్థ అంచనా. అమెరికా జనాభా తగ్గింపును విదేశీ వలసలు ఆపుతున్నాయి. నిరంతరం కొత్త యువకుల రాకతో జపాన్‌, ఇంకా ఇతర దేశాల లాగా, అమెరికాలో వృద్ధ జనాభా పెరగడంలేదు. వలసలను సగానికి తగ్గిస్తే 2044నాటికి అమెరికా జనాభా తగ్గుతుంది. దేశాల జనాభాలు జననాలు, జీవితకాలం పెరుగుదల ధోరణులు మారుతాయి. అన్ని అధికాదాయ దేశాల్లోలాగే అమెరికాలోనూ 50 ఏళ్ల నుండి సంతానోత్పత్తి తగ్గింది. జీవితకాలం పెరిగినా సంతానోత్పత్తి తగ్గడంతో జనాభా ఎక్కువగా పెరగలేదు. రెండు కారణాలవల్ల వృద్ధాప్యం సమస్యాత్మకం. వృద్ధాప్యంతో పనిచేసేవారు తగ్గుతారు. పెన్షన్లు, వృద్ధుల వృద్ధితో వారి జీవన, వయో సంబంధ ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ ఖర్చులతో ఆర్థిక వ్యవస్థపై భారం పెరుగు తుంది. దేశం ఆర్థిక దివాళా స్థితికి చేరుతుంది. జనాభా తగ్గుదల దేశ ఆర్థిక ఆదాయాలను, కొనుగోలుదార్లను తగ్గిస్తుంది. దీనికి భిన్న పరిస్థితి అమెరికా కున్న అత్యధిక భౌగోళిక ఆర్థిక ప్రయోజనాలలో ఒకటి.
అమెరికాలోకి కొనసాగుతున్న వలసలు, తగ్గిన సంతానోత్పత్తికి, జనాభా సమతుల్యతకు ప్రాథమిక పరిష్కారం. వలసల వల్ల పనిచేసే వయసు యువకులు, కార్మికులు, నూతన సాంకేతికతలు సమాజంలో పెరుగుతాయి. పెద్ద సంఖ్యలోని వలసలు తగ్గిన జననాల, పెరిగిన వృద్ధుల దుష్ఫలితాలను తగ్గిస్తాయి. బైడెన్‌ ప్రకటించినట్లు దశాబ్దాల నుండి అమెరికా ఆర్థిక అభివృద్ధిలో, జనాభా స్థిరత్వంలో వలసదారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ దేశాల వనరులతో చదువుకుని ఉన్నత విద్యపై పెద్ద ఖర్చుతో, తర్వాత రాజకీయాలు, సంఘాలు, నిరసనలు లేకుండా ఏక కాలంలో రెండు, మూడు ఉద్యోగాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారు. కొంత డబ్బును స్వదేశానికి కూడా పంపుతారు. జనన మరణాల అసమతుల్యతలను అధిగమించి అమెరికా జానాభా పెరగడానికి వలసలు ప్రధాన కారణం. ఈ ఏడాది ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ గెలిచి మరోసారి డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడైతే, ఆయన వలస వ్యతిరేక విధానాలు అమెరికా జనగణన సంస్థ అంచనాలను తారుమారు చేస్తాయి. కొత్తగా అమెరికాకు వలసవచ్చే వారిని నిర్బంధ శిబిరాల్లో ఉంచుతానని, ఇప్పటికే దేశంలో ఉన్న విదేశీయులను దేశం నుండి పంపుతానని ఆ విధంగా దేశ జనాభాను తగ్గిస్తానని ఇటీవల టైమ్స్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ చెప్పారు. 2016 ఎన్నికల్లో అమెరికా ఆమెరికన్లకే అన్న ఎన్నికల నినాదాలతో ఆయన ప్రజలను రెచ్చగొట్టారు. అమెరికా జనగణన సంస్థ ప్రకారం, 2029 నాటికి అమెరికాలో 64 ఏళ్ళు నిండిన వారి సంఖ్య 18 ఏళ్ల లోపు వారి సంఖ్యను దాటుతుంది. 60 శాతం జానాభాయే 18-64 ఏళ్ల మధ్య వయసులో ఉంటుంది. 2010లో ఈ వయసువారి సంఖ్య 70శాతం. 2038 నాటికి అమెరికాలో మొదటిసారి మరణాలు, జననాలను దాటుతాయని అంచనా. జననాల కంటే మరణాలు 13,000 ఎక్కువగా ఉంటాయని అంచనా. 2100నాటికి ఈ సంఖ్య 12 లక్షలకు పెరుగుతుంది. జపాన్‌లో నేటి మరణాల సంఖ్యకు ఇది రెట్టింపు. 2080కి అమెరికా జనాభా 37 కోట్లకు చేరుతుందని అంచనా. వలసదారుల సంఖ్యను సగానికి తగ్గిస్తే 2044 కే అమెరికా జనాభా 37 కోట్లకు చేరుతుందని జనగణన సంస్థ లెక్క. నేటి అమెరికా జనాభా 33.59 కోట్లు. రిపబ్లికన్‌ నాయకులు సూచిస్తున్నట్లు దేశ సరిహద్దులను మూసేస్తే వచ్చే ఏటికే జనాభా తగ్గుతుంది. స్థానిక అమెరికన్లు నిర్ధారిత ఆదాయాలతో, వారాంతపు వినోదాలతో కాలం గడుపుతారు. వలసల ఆపుదలతో అమెరికా అభివృద్ధి ఆగుతుంది. 2015 మార్చి జనాభా లెక్కలు రిపబ్లికన్ల మెజారిటి, మైనారిటీి జాతిసంఖ్యల మాయాజాల ప్రభావాన్ని చూపాయి. అమెరికా జానాభాలో తెల్లవారు 50 శాతానికి పడిపోతారని ప్రకటించారు. ఈ ప్రచారాలు మతవాదులకు ఎన్నికల లబ్ది ఆశను రేపాయి. ఇతరులకు వలసలు ఆగుతాయన్న భయాన్ని కలిగించాయి. నేడు ఇండియాలో జరుగుతున్న తతంగం ఇదే. గతంలో విదేశాల నుండి వలసలు ప్రాముఖ్యతలేని విషయం. అమెరికన్‌ రిపబ్లికన్‌ పార్టి అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ చట్ట రహితంగా అమెరికాకు వచ్చిన విదేశీయులకు క్షమాభిక్ష ఆమోదించారు. 2015 తర్వాత రిపబ్లికన్‌ పార్టీకి వలసదారులు సమస్య అయ్యారు. 2024 సాధారణ ఎన్నికలకు వలస అతి ప్రాధాన్యత అంశంగా, బైడెన్‌ గెలుపు అవకాశాలకు అడ్డంకిగా మారింది. 2015 లెక్కలను ప్రస్తావించి వలస వ్యతిరేక భావాలను రెచ్చగొట్టారు. ఇటీవలి నివేదిక దానికి విభిన్న ప్రభావాన్ని ప్రతిబింబించింది. కొత్త పరిశోధనలు వలసల పట్ల పారదర్శకతను ప్రతిపాదించాయి. 19 ఐరోపా దేశాల్లో 20 వేలమందితో జనాభా మార్పు తీరుతెన్నులపై సర్వే చేశారు. అమెరికాలోవలె ఆ దేశాల్లోనూ జననాలు తగ్గాయని, అవి స్థానిక ప్రజల సంఖ్యను తగ్గిస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే పెద్దసంఖ్యలో ఆ దేశాలకు వలస వచ్చారని, ఇక మీదట అధిక జననాల ముస్లిం, ప్రత్యేకించి ఆఫ్రికా వంటి ఐరోపాయేతర దేశాల నుండి వలసలను ఆపాలని, లేకుంటే విదేశీ జనాభా అధికమవుతుందని ప్రజలు మతపాలకుల అభిప్రాయాలతో ఏకీభవించారు. డిటొ మోదీ ఇండియా. సంతానోత్పత్తి తగ్గి వృద్ధులు పెరిగిన పశ్చిమ, ఐరోపా దేశాలలో స్థానభ్రంశ సిద్దాంతానికి (రిప్లేస్మెంట్‌ థియరీకి) విముఖత చూపారు. స్వదేశీ వామపక్ష భావవాదుల, విదేశీ ఉన్నతవర్గాల ప్రభావంతో, యూదుల నిర్దేశకత్వంలో స్థానిక శ్వేతజాతిని అధిగమించే విధంగా నల్లజాతీయులను దిగుమతి చేస్తున్నారనే అమెరికా, పాశ్చాత్య దేశాల మతవాద కుతంత్ర సూత్రాన్ని స్థానభ్రంశ సిదాష్ట్రణంతం అంటారు. ఈ సూత్రం సంఖ్యాధిక ఆధిపత్యవాదులను భయోత్పాతానికి గురిచేసి అల్పసంఖ్యాకులపై అసహనాన్ని, ద్వేషాన్ని పెంచుతుంది. మత మైనారిటీలు మెజారిటీలుగా మారతారని ప్రచారం చేస్తుంది. అమెరికా, పాశ్చాత్యదేశాల మతవాద రాజకీయ పాలకులు దేశ సరిహద్దుల చుట్టూ రక్షక కోట గోడలను కట్టాలని ఊగుతున్న నేపథ్యంలో స్థానభ్రంశ సిద్దాంతం ప్రపంచ మానవాళికి అపాయకరం. విదేశీయుల రాక ‘‘సమస్య’’పై ప్రపంచం నేడు కేంద్రీకృతమైంది. ఉత్పత్తి శక్తి లేని వృద్ధ జనాభా పరిష్కారంలేని తీవ్ర సమస్యగా చిత్రీకరించబడిరది. అయితే ప్రజలు సువ్యవస్థిత వలస విధానాన్ని, తమ జాతీయ జనాభాను స్థిరీకరించే ఎదురుదాడి పద్ధతులను కోరుకుంటున్నారు. యువకుల వలసలను దేశ భవిష్యత్తుకు, అభివృద్ధికి మానవ వనరుల పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ప్రతి దేశం స్వదేశాల్లో ఉపాధి అవకాశాలను పెంచడం వలస వ్యతిరేక సమస్యకు పరిష్కారమే కాక స్వదేశాభివృద్ధికి సాయపడుతుంది.
ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి
చరవాణి: 9490 20 4545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img