Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా కర్తవ్యం..

లయన్స్ క్లబ్ అధ్యక్ష ,కార్యదర్శులు.

విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా కర్తవ్యం అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు గూడూరు మోహన్ దాస్ కార్యదర్శి జి. రాజగోపాల్, కోశాధికారి వేణుగోపాలాచార్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో “లయన్స్ ఉచిత కంటి చికిత్స శిబిరమును” నిర్వహించారు. తదుపరి డాక్టర్. నాగేంద్ర రోగులకు కంటి వైద్య చికిత్సలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వన్టౌన్ సిఐ. సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలోనే లయన్స్ క్లబ్ విశేష సేవలు చేస్తూ, ప్రజల మన్ననలు పొందడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. అంతేకాకుండా మన ధర్మవరంలో ఇప్పటికే 40 వేలకు పైగా ఈ లయన్స్ క్లబ్ స్థాపించినప్పటి నుండి పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడం సంతోషించే తగ్గ విషయం అని తెలిపారు. కంటి వైద్య చికిత్సలతో పాటు ఉచిత కంటి ఆపరేషన్, ఉచిత కంటి అద్దాలను కూడా ఇవ్వడం మరుపురాని సేవ అని తెలిపారు. ఇప్పటికే లయన్స్ క్లబ్ వివిధ రకాల సేవలు చేస్తూ కంటిపట్ల ఇటువంటి శిబిరం నిర్వహించడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. తదుపరి అధ్యక్ష కార్యదర్శులు మోహన్ దాస్ రాజగోపాల్ మాట్లాడుతూ ఈ శిబిరానికి 95 మంది కంటి రోగులు రాగా, వారందరికీ కంటి వైద్య చికిత్సలు అందించగా 40 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. తదుపరి లయన్స్ క్లబ్ లో మధు చాలా సంవత్సరాలుగా సేవలు కొనసాగిస్తున్నారు. వీరి కుమారుడు నవదీపు ఇటీవల పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 549/1000 మార్కులు సాధించడం పట్ల లైన్స్ క్లబ్ వారు అభినందించి నగదు పారితోషకమును అందజేశారు. తదుపరి కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి వారు వివరించారు. ఈ శిబిరానికి క్యాంపు దాతగా కీర్తిశేషులు గోసే రామలక్ష్మమ్మ జ్ఞాపకార్థం వీరి కుమారుడు కృష్ణ అండ్ సన్స్ వ్యవహరించడం పట్ల లైన్స్ క్లబ్ వారు అభినందన శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చార్ట ర్ నెంబర్ పల్లెమ్ వేణుగోపాల్, చెన్నం శెట్టి జగదీష్, ముక్తాపురం కృష్ణ, టీచర్ రమేష్, పిడి. నాగేంద్ర, లయన్స్ క్లబ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img