Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Thursday, October 3, 2024
Thursday, October 3, 2024

రాజకీయ చరిత్రను తిరిగి రాసిన ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్

విశాలాంధ్ర ధర్మవరం:: ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను తిరిగి రాసిన ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్కే దక్కింది. ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో 40 రోజుల్లోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి, అసాధారణ ప్రచారాన్ని కొనసాగించి, అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రివర్గంలో స్థానాన్ని కైవసం చేసుకున్న రు సత్య కుమార్ యాదవ్. చరిత్ర తిరిగి చూస్తే 1955లో పి. రామాచారి, 1967లో పి. వెంకటేష్, తిరిగి 2024లో సత్య కుమార్ యాదవ్ గా చెప్పుకోవచ్చు. రాష్ట్ర చరిత్రతో పాటు నియోజకవర్గ చరిత్రను కూడా శాసనసభ్యులు, మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ తిరిగి రాశారు అని బాహాటంగా చెప్పవచ్చు. ఏపీలో ధర్మవరం నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఇద్దరు మాత్రమే బీసీ కులానికి చెందిన వ్యక్తులు నియోజకవర్గానికి శాసనసభ్యులు కావడం జరిగింది. ఆ తర్వాత అగ్రవర్ణ కులాల వ్యక్తులు రాజ్యమేలుతూ వచ్చారు. 2024లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి అని నియోజకవర్గ ప్రజలు పార్టీలకు అతీతంగా సత్యకుమారి యాదవులు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. 40 రోజుల్లోనే నియోజకవర్గ ప్రజలను తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకొని, ప్రజల హృదయాలలో గూడు కట్టుకున్న రు. ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి లు కలసి సత్య కుమార్ యాదవ్కు మద్దతు పలికి, కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సత్యకుమార్ యాదవ్ను శాసనసభ్యులుగా గెలుపొందేటట్లు విశేష కృషి చేశారు. ధర్మారంలో సంవత్సరాలు గడిచిన ఇంతవరకు బిజెపి జెండా ఎగరలేదు. అలాంటిది ఎన్డీఏ అభ్యర్థిగా సత్య కుమార్ యాదవ్ నేడు బిజెపి జెండా ఎగురవేయడమే కాకుండా ఎమ్మెల్యేగా మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. ధర్మవరం నియోజకవర్గం పట్టణము యొక్క రూపు రేఖలను మార్చడమే కాక అభివృద్ధి చేపడుతారని వారు హామీ ఇచ్చా రు. తప్పక సత్య కుమార్ యాదవ్ అభివృద్ధి చేస్తాడని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు. ఏది ఏమైనా ధర్మవరం నియోజకవర్గంలో ఇటువంటి గెలుపు ఎమ్మెల్యేగా బీసీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కె కైవసం కావడం నిజంగా శుభదాయకం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img