Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Thursday, October 3, 2024
Thursday, October 3, 2024

క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించండి..

డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సేల్వియా సాల్మాన్
విశాలాంధ్ర ధర్మవరం:: క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించి ప్రాణాలను కాపాడాలని డిప్యూటీ డి ఎంఅండ్ హెచ్ ఓ. డాక్టర్ సేల్వియా సాల్మాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 13వ తేదీ నుండి జూలై 10వ తేదీ వరకు విడతలవారీగా మెడికల్ ఆఫీసర్లకు, సిహెచ్ఓ లకు, ఏఎన్ఎం లకు క్యాన్సర్ అండ్ ఎన్సిడి- సిడి లపై అవగాహన సదస్సులు ఉంటాయని, మూడు రోజులు చొప్పున ఈ శిక్షణా కార్యక్రమం ధర్మవరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఉంటుందని వారు తెలిపారు. ఈ శిక్షణా తరగతులను డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శివశంకర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో నోటికి, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వారంకు వచ్చు క్యాన్సర్లపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. నోటి క్యాన్సర్ ఎలా వస్తుంది? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాలపై వివరణ ఇస్తూ ఉదాహరణకు పొగాకు,సిగరెట్టు, బీడీలు, గుట్కా, కైనీపాని, జరదా వంటి వాటికి దూరంగా ఉండటం వలన నోటి క్యాన్సర్లు నివారించ వచ్చునని తెలిపారు. అలాగే నోటిలో వాపు, తెల్లగా, ఎర్రగా వచ్చినా ..మచ్చలు ఉన్న, ముక్కు నుంచి ,నోటి నుంచి రక్తం వచ్చిన ఎడల సమీప దంత వైద్యులను వెంటనే సంప్రదించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్బి ఎస్.కె సంబంధించిన డాక్టర్ నివేదిత, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి లత, గైనకాలజిస్ట్ డాక్టర్ శైలజ, పెథాలజిస్ట్ డాక్టర్ వైష్ణవి, దంత వైద్యులు- డాక్టర్. వివేక్ పిహెచ్సి కు సంబంధించిన మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img