జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. గురువారం సాయంత్రం అనంతపురం నగరంలోని ఇండోర్ స్టేడియాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, పిల్లల సమ్మర్ క్యాంపులు, కోచ్ ల, క్రీడాకారుల పనితీరు, క్రీడల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆర్చరీ, బాస్కెట్ బాల్, క్యారమ్స్, చెస్ పోటీలలో జిల్లా కలెక్టర్ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడల మానసిక ఉల్లాసానికి ఎంత దోహదపడతాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, డిఎస్డివో షఫీ, కోచ్ లు, ఆర్చరీ, బాస్కెట్ బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.