Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Wednesday, October 2, 2024
Wednesday, October 2, 2024

మీ అవినీతి దౌర్జన్యాలు భరించలేకనే ప్రజలు ఓడిస్తే… ఈవీఎంలపై నిందలు వేస్తారా..?

… మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పై బిజెపి నాయకులు ధ్వజం
విశాలాంధ్ర ధర్మవరం:: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఐదు సంవత్సరాలలో ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతూ అభివృద్ధి చేయలేదని, మీ అవినీతి దౌర్జన్యాలు భరించలేకనే ప్రజలు మిమ్ములను ఓడిస్తే,, ఈవీఎంలపై నిందలు వేస్తారా? అంటూ బిజెపి నాయకులు కేతిరెడ్డి పై ధ్వజమెత్తారు. అనంతరం స్థానిక బిజెపి కార్యాలయంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు చాకే ఓబులేష్ , జింక చంద్రశేఖర్, అసెంబ్లీ కన్వీనర్ గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ వైసీపీ తీరును ఎండగట్టా రు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఈవీఎంలపై సామాజిక మాద్యాలలో విమర్శించడంపై తమదైన శైలిలో బిజెపి నాయకులు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ధర్మారంలో కేతిరెడ్డి వెంకట్రాం రెడ్డి యొక్క అరాచకాలు ప్రజా వ్యతిరేక విధానాలు భరించలేకనే ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పడం జరిగిందని తెలిపారు. అయినా సరే కేతిరెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈవీఎంలపై అభండాలు వేయడం దిగజారుడా తనానికి నిదర్శనం అన్నారు. తమ వల్లే ఓడిపోయామని విషయాన్ని పక్కనపెట్టి ప్రజలను మభ్యపెట్టడానికి మీరు చేస్తున్న మాయలు కట్టి పెట్టాలని దుయ్యబట్టారు. మీరెన్ని ఆరోపణలు చేసిన ప్రజలు మీ మాటలను వినే పరిస్థితిలో లేరని అందుకు సార్వత్రిక ఎన్నికల ఫలితాలే రుజువు కావడం జరిగిందని వారు గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం 151 సీట్లు సాధిస్తే, 2024లో ఈవీఎంలపై ట్యాంపరింగ్ జరిగిందని చెప్పడానికి సిగ్గు ఉందా అని నిలదీశారు. చదువుకున్న వారు ఎవరైనా విషయ పరిజ్ఞానం ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరని వారు ఎద్దేవా చేశారు. కేతిరెడ్డి చదువుకున్న ఆజ్ఞని కావడం వల్లనే ఈవీఎంలపై బురద చెల్లే ప్రయత్నాలకు పూలు కోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు ముక్తకంఠముతో మిమ్ములను తిరస్కరించిన ఇంకా ఏదో మాయమాటలు చెప్పుకోవడానికి ప్రయత్నించడం చూస్తూ ఉంటే దెయ్యాల మీద వేదాలు వల్లించినట్లు ఉందని తెలిపారు. ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గుండా పుల్లయ్య, కొత్తకోట రవీందర్ రెడ్డి, జల్లా కార్తీక్, పుట్లూరు నరసింహులు, మాజీ సర్పంచ్ రామకృష్ణ, రాధమ్మ, మహాలక్ష్మి, నాగేంద్ర ,రమేష్, నబి రసూల్, మల్లికార్జున, చింతా మంజునాథ్, నాగభూషణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img