Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Monday, September 30, 2024
Monday, September 30, 2024

అనంతపురం జిల్లాలో ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం పర్యటన

ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం

రబీ 2023-24లో కరువు పరిస్థితిపై వివరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, ఇతర రాష్ట్ర అధికారులు

విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో బుధవారం రాష్ట్రంలో, రాయలసీమ జిల్లాల్లో కరువు పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ తో కలిసి ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం లీడర్ (జాయింట్ సెక్రటరీ & సిఈఓ, పి.ఎం.ఎఫ్.బి.వై డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, న్యూఢిల్లీ) రితేష్ చౌహాన్ ఐ.ఏ.ఎస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డైరెక్టర్ చిన్మయ్ పుండ్లిక్ రావ్ గోత్మారే ఐ.ఏ.ఎస్, హైదరాబాద్ డిటిఈ. ఆఫ్ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ డైరెక్టర్ డా.కె.పొన్ను స్వామి, న్యూ ఢిల్లీ ఎంఎంసిఎఫ్సి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ సునీల్ దూబే, డ్రింకింగ్ వాటర్ & శానిటేషన్ శాఖ డిప్యూటీ అడ్వైజర్ ఆశిష్ పాండే, రూరల్ డెవలప్మెంట్ శాఖ అండర్ సెక్రెటరీ అరవింద్ కుమార్ సోనీ, తదితరులు పరిశీలించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర, రాయలసీమ జిల్లాల్లో రబీ 2023-24లో కరువు పరిస్థితిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇతర శాఖల రాష్ట్ర, జిల్లాల అధికారులు వివరణత్మకంగా వివరించారు. అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, శ్రీ సత్య సాయి, నెల్లూరు జిల్లాల పరిధిలో వ్యవసాయ, ఇతర శాఖల కింద పప్పు సెనగ, జొన్న, ఉలవలు తదితర పంటల నష్టం వివరాలు, భూగర్భ జలాలు అడుగంటడం, జిల్లాలో వర్షపాతం వివరాలు, ఉపాధి హామీ కింద చేపట్టిన వాటర్ కన్జర్వేషన్ పనులు, దీర్ఘకాల యాక్టివిటీలు, హార్టికల్చర్ ప్లాంటేషన్, అర్బన్, రూరల్ వాటర్ సప్లై, తదితర వివరాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీంకి తెలియజేశారు. కరువు పరిస్థితిపై పూర్తిస్థాయి వివరాలను ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం అధికారులు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ & ఏపీఎస్డీఎంఏ ఆర్. కూర్మనాథ్, ఏపీఎస్డీఎంఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.నాగరాజు, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, గ్రౌండ్ వాటర్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విశ్వేశ్వరరావు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జగ్గారావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ బ్రహ్మాజీ, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఈశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ శివప్రసాద్, డిఆర్ఓ రామకృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రహ్మణ్యం, గ్రౌండ్ వాటర్ డిడి తిప్పేస్వామి, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనాథ్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డి పీవీఎస్ఎన్ మూర్తి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, శ్రీ సత్య సాయి, నెల్లూరు జిల్లాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img