విశాలాంధ్ర ధర్మవరం:: ప్రజా కంటక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేయడంపై ధర్మవరం న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయవాది సుబ్బారావు కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయాలని మొదట న్యాయవాదులే ఉద్యమం చేపట్టడం జరిగిందని, అంతేకాకుండా రిలే దీక్షలు కూడా చేయడం జరిగిందని వారు గుర్తు చేశారు. ఈ రద్దు రైతులకు ప్రజలందరికీ కూడా ఆమోద్యమోగంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రహమతుల్లా, కృష్ణమోహన్, దుర్గాప్రసాద్, చౌదరి, రవి, బిల్లే నరేంద్ర, గుంటప్ప,అబ్దుల్లా, రంగానాయుడు, గోపి తదితరులు పాల్గొన్నారు.