London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

ధృతరాష్ట్ర కౌగిలిలో బాబు, నితీశ్‌

ఎం.సి.వెంకటేశ్వర్లు

పార్లమెంటు సీట్లు 400కుపైగా సాధించి మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రచారం చేసుకున్న మోదీ భంగపడక తప్పలేదు. అయినా ప్రధానిగా ప్రమాణస్వీకారంచేసి, నెహ్రూ రికార్డుని సమం చేయాలన్న ఆకాంక్షను నెరవేర్చుకున్నాడు. గతంలో మోదీ చేతిలో అవమానాలకు గురైన ఏ.పీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, మోదీ ఆలింగనాలతో తరించిపోయి ఆయన ఆకాంక్షను నెరవేర్చారు. కాని చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి నితీశ్‌కుమార్‌ ముఖ్యమంత్రి పదవిని కాపాడు కోవడానికి మోదీతో స్నేహం తాత్కాలికంగా ప్రయోజనం చేకూర్చవచ్చు. కానీ వారిద్దరు ధృతరాష్ట్ర కౌగిలిలో బందీలైన విషయం గమనార్హం.
బాబు, నితీశ్‌ అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రులు. ప్రత్యేకించి బాబు, వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్‌డీఏ కన్వీనర్‌గా ఉండడమేగాక, దేశ రాజకీయ, ఆర్థిక లక్ష్యాలపై స్పష్టమైన దృక్పధం కలిగిన వ్యక్తి. అయినప్పటికీ వారికున్న అనుభవాలను, ప్రతిష్ఠను, ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి మోదీకి భజన చేయటలో బీజేపీ భజంత్రీలను మించిపోయారు.
ఈ నెల 7వ తేదీన పాత పార్లమెంటు భవనంలో జరిగిన ఎన్‌డీఏ పార్లమెంటు సమావేశంలో చంద్రబాబునాయుడు తమ నాయకుడుగా మోదీని బలపరుస్తూ దేశ ప్రధానిగా నరేంద్రమోదీ పేరును గర్వంగా సమర్థిస్తున్నాను…మానవతావాదం తప్ప తనకు మరోవాదం తెలియదని ఎన్‌టిఆర్‌ చెప్పారని, దానిని మోదీ ఇప్పుడు సాకారం చేస్తున్నాడ’’ని చెప్పి తెలుగు ప్రజలను సిగ్గుతో తలవంచుకునేట్లు చేశాడు. బీహార్‌ ముఖ్యమత్రి నితీశ్‌కుమార్‌ మరొక అడుగు ముందుకువేసి మోదీ 10 సంవత్సరాల పాలనలో జరిగిన అభివృద్ధి అద్భుతమని, ప్రణాళికా బద్దంగా ఉందని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. మోదీ సైతం తన పాలనలో జరిగిన అభివృద్ధిని, గత ఎన్నికల హామీల అమలు గూర్చి ఎన్నికల సభలో చెప్పుకునే ధైర్యం చేయలేదు. కాని నితీశ్‌కుమార్‌ మాత్రం మోదీ ప్రణాళికాబద్ధ అభివృద్ధి గురించి చెప్పడం శోచనీయం.
నిజానికి మోదీ మానవతావాదా? అయితే 2002 గోద్రా ఘటనల అనంతరం ప్రపంచ దేశాలు మోదీకి వీసా ఇవ్వడానికి ఎందుకు నిరాకరించాయి? గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో సంఫ్‌ుపరివార్‌ ముస్లింలను ఊచకోతకోసినా కనీసం విచారం కూడా ప్రకటించకుండా నిరాకరించిన మోదీ మానవతావాది అని చెప్పడం రాజకీయ అవకాశం కాదా? పైపెచ్చు మోదీని ఎన్‌టిఆర్‌తో పోల్చడం ఎన్‌టిఆర్‌కు అవమానం కాదా? ఆనాడు ప్రధానిగా ఉన్న వాజపేయి, శరణార్థి శిబిరాలలో తలదాచుకుంటున్న వేలమంది నిరాశ్రయులను చూసి చలించిపోయి పాలకులు రాజధర్మాన్ని పాటించాలని హితవు పలికినా తలకెక్కించుకోని మోదీ ఎంత కర్కశ హృదయుడో 140 కోట్లమంది ప్రజలకు ఆర్థమైంది.
వ్యక్తిగతంగా తాను, తను నేతృత్వం వహిస్తున్న బీజేపీ అధికారంలో శాశ్వితంగా తిష్టవేయడానికి ప్రధాని మోదీ ఎంచుకున్న మార్గం నిరంకుశపాలన, ప్రతిపక్షపార్టీల నిర్వీర్యం, ‘‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’’ పేరుతో జమిలి ఎన్నికలు జరిపించడానికి రాజ్యాంగాన్ని మార్చడం, కార్పొరేట్‌ వర్గాల మద్దతుతో పాలన సాగించడం మోదీ 10 సంవత్సరాల పాలనే ప్రత్యక్ష సాక్ష్యం. 2014లో అధికారంలోకి రావడంతోనే ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌’ నినాదాన్నిచ్చాడు. అలీనోద్యమ నిర్మాతగా ప్రపంచఖ్యాతి వహించిన, నవభారత నిర్మాతగా దేశప్రజలు గుర్తించిన దేశ ప్రథóమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రును, ఆయన కుటుంబాన్ని దేశానికి ప్రథమ శత్రువులుగా చిత్రించి ప్రజలను నమ్మించడానికి విఫలప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలలో సాధించలేని అభివృద్ధిని 70నెలల్లో తానుసాధించినట్లు, ప్రపంచం మొత్తం తనవైపే చూస్తున్నట్లు అసత్య ప్రకటనలను మోదీ నిత్యం వల్లిస్తుంటే దశాబ్దాలుగా ముఖ్యమంత్రులుగా చేసిన బాబు, నితీశ్‌ మోదీకి భజన చేయడం ఏపీ, బీహార్‌ రాష్ట్ర ప్రజలకే అవమానకరం.
భారతదేశం జీడీపీలో బ్రిటన్‌ను అధిగమించి నాలుగవ స్థానంలో చేరినా, త్వరలోనే మూడవ స్థానానికి చేరుతుందన్నా, ఆసియాలోనే శీఘ్రగతిన అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తించినా దానికి మోదీ కారకుడని చెప్పుకోవడం హాస్యాస్పదం. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రు సోవియట్‌ యూనియన్‌ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో ప్రభుత్వరంగాన్ని ఏర్పాటుచేయడం, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం, ఆటమిక్‌ కేంద్రాల ఏర్పాటు, ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్యాంకులు ఏర్పాటు భారతదేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయనడం జగమెరిగిన సత్యం. 1990 సంవత్సరంలో దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో మన్‌మోహన్‌సింగ్‌ 1991లో ఆర్థిక మంత్రిగా నూతన సంస్కరణలు అమలు జరిపి దేశాన్ని ముందుకు తీసుకుపోయారు. ప్రధానిగా ఉన్న వాజపేయి హయాంలో రోడ్లు, రహదారులు, ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు తదితర మౌలిక వసతుల నిర్మాణంపై కేంద్రీకరించారు. వాటినే నేడు 10 సంవత్సరాలుగా మోదీ కొనసాగిస్తున్నాడు తప్ప కొత్తగా చేసింది శూన్యం.
ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల శిబిరంలో ఆ సంస్థ అధినేత మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ‘‘నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు. నేనే చేశానని చెప్పుకోడు. ప్రజాజీవితంలో మర్యాద పాటిస్తాడు అని చెప్పాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ‘‘ఆర్గనైజర్‌’’ బీజేపీ ఎన్నికల వైఫల్యాలపై ఘాటుగా స్పందిస్తూ, మోదీ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శించింది. ఇవి కమ్యూనిస్టులో, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలైతే కొంతమేర ఆలోచించాలి. కానీ బీజేపీ మాతృసంస్థ, రిమోట్‌గా వ్యవహరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌, ఆ సంస్థ పత్రిక ఆర్గనైజర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడమంటే మోదీ అహం, నిరంకుశ విధానాలు ఏ స్థాయికి చేరాయో అర్థమవుతుంది. కనీసం ఆపాటి ఆలోచన కూడా బాబు, నితీశ్‌కు లేకపోవడం ఆశ్చర్యం కలుగుతుంది.
మోదీ ఏనాడు రాజ్యాంగాన్ని, ఫెడరలిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన దాఖలాలు లేవు. రాజ్యాంగబద్ద సంస్థలను జేబు సంస్థలుగా మార్చి పత్రిపక్ష పార్టీలను, నాయకులను వేధించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంతసొరేన్‌ను అవినీతిపరులుగా ముద్రవేసి జైల్లో పెట్టారు. అదే మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌, అశోక్‌చవాన్‌లాంటి 25 మందికిపైగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా మోదీకి, బీజేపీకి వారు ఆప్తులు కనుక చర్యలు శూన్యం. మోదీ మిత్రుడు అదానీపై అనేక ఆరోపణలున్నా మోదీ అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. మోదీపై విమర్శలుచేసే రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు జైళ్లలో కుక్కబడ్డారు. భీమాకోరేగావ్‌ కేసుపై ఇంతవరకు ఎలాంటి విచారణ లేకున్నా ‘‘ఉపా’’ చట్టం కింద సంవత్సరాలుగా అనేకమంది జైళ్లలో మగ్గుతున్నా వీటన్నింటిని కళ్లున్నా బాబు, నితీశ్‌ చూడ నిరాకరించడం బాధాకరం.
చంద్రబాబు సైతం మోదీ దాడుల బాధితుడే! 2018లో బాబు ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్నప్పుడు ‘‘ఈడీ’’ రైడ్‌ చేసింది. ఆ సందర్భంలో ‘‘నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఈడీ, ఐటీ దాడులను ఎదుర్కోవలసిందే. మేము ఈ చర్యలకు భయపడం. న్యాయం జరిగేంతవరకు మేము పోరాడుతాం. నేను 5 కోట్లమంది తెలుగు ప్రజల తరఫున మాట్లాడుతున్నాను’’ అని ప్రకటించాడు. కాని ఆ ధైర్యం, తెగింపు ఈనాడు ఏమైనట్లు? జగన్‌ అరెస్టు చేయించడంతోనే బాబు నీరసించి పోయాడా?
కాని 2024 మేలో జరిగిన శాసనసభ ఎన్నికలకు ప్రత్యేకత ఉన్నదనడంలో సందేహంలేదు. జగన్‌ పాలనలో అవినీతి అక్రమాలు పతాకస్థాయికి మించిపోయాయి. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు పోలీస్‌ యంత్రాంగం, జగన్‌ తాబేదారులైన మాట నిజం. రాజధాని లేదు, రాష్ట్రం అప్పులపాలైంది. ఈ పరిస్థితులను చక్కదిద్దుకోడానికి, ఎన్నికల సందర్భంలో పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకోవడానికి కేంద్రం సహాయ సహకారాలు అవసరం అనే దానిలో కూడా సందేహంలేదు. కాని గత అనుభవం చూసినా, మోదీ వ్యక్తిత్వం చూసినా, బాబు ఆశలు నెరవేరడం పరిమితంగా ఉంటాయనడం వాస్తవం. అటువంటప్పుడు బాబు లౌక్యంగా ఉండాలి తప్ప జీ హుజూర్‌ అంటూ భజంత్రిగా మారితే, ఆంధ్రప్రదేశ్‌ మరోసారి దగాపడటం ఖాయం.
సెల్‌: 8121223457

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img