Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

నీటి కోసం ఆప్‌ మంత్రి నిరాహార దీక్ష

హర్యానా నుంచి ఎక్కువ నీటి విడుదలకు డిమాండ్‌

న్యూదిల్లీ: హర్యానా నుంచి ఎక్కువ నీరు ఇవ్వాలనే డిమాండ్‌పై ఒత్తిడి తేవడానికి ఆప్‌ నేత, దిల్లీ జల వనరులశాఖ మంత్రి అతిశీ శుక్రవారం దక్షిణ దిల్లీలోని భోగల్‌లో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌, దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌తో పాటు అతిశీ నిరాహార దీక్ష చేపట్టారు. తీహార్‌ జైలులో ఉన్న ముఖ్యమంత్రి సందేశాన్ని సునీతా కేజ్రీవాల్‌ చదివి వినిపించారు. అందులో అతిశీ దీక్ష విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్రమైన వేడిగాలుల మధ్య ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని టీవీల్లో చూసి తాను చాలా బాధపడ్డానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘దాహంతో ఉన్నవారికి నీరు అందించడం మన సంస్కృతి. దిల్లీకి పొరుగు రాష్ట్రాల నుంచి నీరు వస్తుంది. ఇంత తీవ్రమైన వేడిలో పొరుగు రాష్ట్రాల మద్దతు మేము ఆశించాం. కానీ హర్యానా… దిల్లీ నీటి వాటాను తగ్గించింది. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ఇది నీటిపై రాజకీయాల కోసం సమయం’ అని హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీని ఉద్దేశించి తెలిపారు. అంతకుముందు, అతిశీ, సునీతా కేజ్రీవాల్‌, సింగ్‌, భరద్వాజ్‌, ఇతర నాయకులతో కలిసి భోగల్‌కు వెళ్లే ముందు రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. దిల్లీలో తీవ్రమైన వేడి గాలుల మధ్య ప్రజల నీటి అవసరాలు పెరిగాయి. ఇలాంటి సమయాల్లో ప్రజలకు ఎక్కువ నీరు అవసరం, కానీ కొరత ఉంది. దిల్లీలోని నీళ్లన్నీ దాని పొరుగు రాష్ట్రాల నుంచి వస్తాయని నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించిన అతిశీ చెప్పారు. దిల్లీకి సరిపడా నీళ్లు అందడం లేదని హర్యానా ప్రభుత్వానికి తాను చేసిన విజ్ఞప్తి, సహాయం కోసం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినా ఫలితం లేదని ఆమె అన్నారు. ‘దిల్లీలోని పురుషులు, మహిళలు, పిల్లల కష్టాలను చూడలేక నిరవధిక నిరాహార దీక్ష చేయడం తప్ప ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. దిల్లీ ప్రజలకు హర్యానా నుంచి నీళ్లు వచ్చే వరకు ఈ నిరవధిక జల సత్యాగ్రహం కొనసాగుతుంది’ అని అతిశీ తెలిపారు. దిల్లీకి 1005 ఎంజీడీ నీరు అందుతుంది. ఇది నగరంలోని ప్రజలకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గత రెండు వారాలుగా హర్యానా… దిల్లీకి 613 ఎంజీడీలకు బదులుగా 513 ఎంజీడీలను ఇస్తోంది. హర్యానా 100 ఎంజీడీ నీటిని ఆపడంతో 28 లక్షల మందికి పైగా ప్రజలు కొరతను ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పారు. గత రెండు రోజుల్లో హర్యానా… దిల్లీ వాటా విడుదలను 100 ఎంజీడీ నుంచి 120 ఎంజీడీ తగ్గించిందన్నారు. ఉదయం మంత్రి అతిశి మాట్లాడుతూ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, హర్యానా ప్రభుత్వం దిల్లీకి పూర్తి నీటి వాటాను విడుదల చేయనందున భోగల్‌లో తన నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తానని చెప్పారు. ‘నేను ఈ రోజు నుంచి ‘పానీ సత్యాగ్రహం’ ప్రారంభిస్తాను. దిల్లీ ప్రజలు హర్యానా నుంచి తమ హక్కు నీటి వాటాను పొందే వరకు నేను 12 గంటల నుంచి భోగల్‌, జంగ్‌పురా వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తాను’ అని మంత్రి అతిశీ ‘ఎక్స్‌’ లో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img