జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర – అనంతపురం : గృహ హింసకు వ్యతిరేకంగా నిలబడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గృహ హింసకు వ్యతిరేకంగా నిలబడదాం అనే పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఐదుగురు మహిళల్లో కనీసం ఒకరు జీవితంలో ఎప్పుడైనా ఒకసారి గృహ హింసను ఎదుర్కొని ఉంటారని, మన సమాజంలో మహిళలకు ఆత్మగౌరవం మరియు రక్షణ కావాలన్నారు. గృహహింస బాధితులు సహాయం కోసం మహిళా శిశు సంక్షేమ శాఖలోని గృహహింస విభాగాన్ని మరియు ఉమెన్ హెల్ప్ లైన్ 181 కు సంప్రదించాలన్నారు. గృహహింస నుండి ప్రతి ఒక్కరికి విముక్తి కల్పించాలని, ఇందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఐసిడిఎస్ పిడి బి.ఎన్.శ్రీదేవి, ఐసిడిఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.