London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

మోదీ అసంబద్ధ దాడి

. సానుభూతి కోసమే రాహుల్‌ కొత్త డ్రామా అంటూ ప్రధాని విమర్శలు
. మణిపూర్‌, నీట్‌ అంశాలపై మాట్లాడాలన్న ప్రతిపక్షాలు
. నినాదాలతో అడుగడుగునా నిరసన

లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు పరిపక్వతతో తీర్పునిచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరుసగా మూడోసారి తాము అధికారంలోకి రావడంతో కొందరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

న్యూదిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు పరిపక్వతతో తీర్పునిచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరుసగా మూడోసారి తాము అధికారంలోకి రావడంతో కొందరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శల దాడి చేశారు. ఎన్ని అసత్యాలు చెప్పినా లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని వారి బాధను అర్థం చేసుకోగలనని హేళన చేశారు. దేశ ప్రజల తమ అభివృద్ధిని చూసే మరోసారి అధికారం ఇచ్చారని చెప్పారు. సానుభూతి పొందేందుకు రాహుల్‌ గాంధీ కొత్త డ్రామా మొదలుపెట్టారన్న మోదీ… ఆయనతో ఏమీ కాదని దేశానికి తెలుసునన్నారు. ‘సానుభూతి పొందేందుకు రాహుల్‌ గాంధీ కొత్త డ్రామా మొదలుపెట్టారు. కానీ వేల కోట్ల రూపాయల అవినీతి కేసులో ఆయన బెయిల్‌పై బయట ఉన్నారనే నిజం దేశానికి తెలుసు. ఓబీసీ ప్రజలను దొంగలుగా అభివర్ణించిన కేసులో రాహుల్‌కు శిక్ష పడిరది. సుప్రీంకోర్టులో బాధ్యతారాహిత్య ప్రకటన చేయడం వల్ల క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌ సావర్కర్‌ లాంటి వ్యక్తిని అవమానించినందుకు ఆయనపై కేసు ఉంది. ఆయనతో ఏమీ కాదని దేశానికి తెలుసు’ అని మోదీ అన్నారు. దేశ అభివృద్ధితోనే భావితరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వగమని మోదీ చెప్పారు. మోదీ ప్రసంగం మొదలు పెట్టగానే మణిపూర్‌, నీట్‌ అంశాలపై ప్రధాని మాట్లాడాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ దశలో స్పీకర్‌ ఓంబిర్లా మాట్లాడుతూ… ప్రతిపక్ష నేతగా ఎంపీలను ఆందోళన చేయమనడం సరికాదంటూ రాహుల్‌ గాంధీని ఉద్దేశించి అన్నారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తగ్గలేదు. వారి ఆందోళనల మధ్యే తన ప్రసంగాన్ని కొనసాగించిన ప్రధాని మోదీ తమ పదేళ్ల పాలన బాగుంది కాబట్టే ప్రజలు మూడోసారి అవకాశం ఇచ్చారని తెలిపారు. ‘పదేళ్ల పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. స్వతంత్ర భారత దేశంలో ఇంత తక్కువ సమయంలో ఇంతమంది ప్రజలు పేదరికం నుంచి బయటపడేసిన సఫల ప్రయత్నమే ఈ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి కారణం. 2014లో మేము తొలిసారి విజయం సాధించి వచ్చినప్పుడు, ఎన్నికల సమయంలోనూ అవినీతిని సున్నా శాతానికి తీసుకెళతామని చెప్పాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారత సామర్థ్యం పెరిగింది. ప్రపంచంలో భారత్‌ గౌరవం పెరిగింది. మా ప్రతి విధానం, మా ప్రతి నిర్ణయం, మా ప్రతి చర్య ఏకైక లక్ష్యం భారత్‌ ప్రథమం’ అన్నారు. ఎన్డీఏ బుజ్జగింపు రాజకీయాలు చేయదన్న మోదీ…ప్రజలందరినీ సంతృప్తి పరిచేలా ప్రభుత్వ పాలన ఉంటుందని వెల్లడిరచారు. 2014 కంటే ముందు ఉగ్రవాదులు దేశంలో దాడులు చేస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉండేదని కాంగ్రెస్‌ ను ఉద్దేశిస్తూ మోదీ విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం రావడం వల్లనే ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. కాగా ప్రధాని మాట్లాడుతున్నంతసేపూ లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో ప్రధాని ప్రసంగానికి అంతరాయం కలిగించడానికి వ్యతిరేకంగా లోక్‌సభ ఓ తీర్మానం ఆమోదించింది. అనంతరం నిరవధికంగా వాయిదా పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img