London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

మళ్లీ ఉచిత ఇసుక

. మూడు నెలల్లో కొత్త విధానం అమలు
. రవాణా, లోడిరగ్‌ చార్జీలపై అధ్యయన కమిటీ
. ప్రస్తుతం స్టాక్‌ పాయింట్లలోని నిల్వలు పంపిణీ
. గత ప్రభుత్వ విధానం వల్ల జరిగిన నష్టంపై నివేదిక
. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : బంగారం కంటే ప్రియమైన ఇసుక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వలే మళ్లీ ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకు రావాలని నిర్ణయించింది. సచివాలయంలో బుధవారం గనుల శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెల్లడిరచారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుదేలైన నిర్మాణ రంగానికి మరలా జవసత్వాలు అందించేందుకు ఉచిత ఇసుక పాలసీ అత్యవసరమని ముఖ్యమంత్రి భావించారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని మరలా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రవాణా, లోడిరగ్‌ చార్జీల నిర్ణయంపై కలెక్టర్ల అధ్యక్షతన ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రికి సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకాల విధానం ఎలా ఉంది. ఎవరు లబ్ధి పొందారు. ప్రభుత్వానికి జరిగిన నష్టం… పేదలు, గృహ నిర్మాణ రంగానికి జరిగిన నష్టమెంతో అంచనా వేస్తూ ఒక నివేదిక సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
నిర్మాణ రంగాన్ని పునరుద్ధరిస్తాం: మంత్రి రవీంద్ర
రానున్న మూడు మాసాల్లో ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చి ఉచితంగా ఇసుకను అందరికీ అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బుధవారం సీఎంతో సమీక్ష అనంతరం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వివరాలు వెల్లడిరచారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలులోకి తేవడం ద్వారా నిర్మాణ రంగాన్ని పునరుద్ధరించి, ఆ రంగంపై ఆధారపడిన కార్మికులు అందరికీ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలిపారు. ఇందుకోసం రానున్న మూడు మాసాల్లో మార్గదర్శకాలను రూపొందించి పటిష్టమైన ఉచిత ఇసుక విధానాన్ని రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం అనుసరించిన ఇసుక విధానం వల్ల రాష్ట్రంలో నిర్మాణ రంగమంతా కుదేలైందని, ఆ రంగంపై ఆధారపడిన 40 రంగాల కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ప్రైవేటు ఏజెన్సీలకు గత ప్రభుత్వం ఇసుకను అమ్ముకోవడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే అంశంపైనే దృష్టి సారించిందని, ఫలితంగా కోట్లాది మంది కార్మికులు ఎంతగానో నష్టపోయా రన్నారు. అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉచితంగా ఇసుకను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి నిరంతరాయంగా నిర్మాణ రంగం కొనసాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన ఇసుక విధానాన్ని నిలుపుదల చేయడంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రస్తుతం వర్షాకాలం అయినందున సెప్టెంబరు లోపు రీచ్‌ల నుంచి ఇసుక తవ్వకాలకు వీలుండదన్నారు. రానున్న పక్షం రోజుల్లో రాష్ట్రంలో అధికారికంగా, అనధికారి కంగా ఉన్న ఇసుక స్టాక్‌ పాయింట్లను గుర్తించి వాటిల్లో అందుబాటులో ఉన్న ఇసుకను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. రానున్న మూడు మాసాల పాటు దాదాపు కోటి టన్నుల ఇసుక అవసరం అవుతుందని అంచనా వేశామ న్నారు. స్టాక్‌ పాయింట్ల నుంచి ఇసుక రవాణా చేసే వాహనాల చార్జీలను కూడా నియంత్రించి అతి తక్కువ చార్జీలకే ఇసుక రవాణా అయ్యే విధంగా, ఇసుక బ్లాక్‌ మార్కెటింగ్‌ నివారణకు చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img